50 శాతం అర్హులకు రెండు డోసులు పూర్తి.. కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు

by Shamantha N |   ( Updated:2021-12-05 05:49:06.0  )
carona vacction
X

న్యూఢిల్లీ: దేశంలో అర్హులైన వారిలో 50 శాతం జనాభాకు పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్ పూర్తైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇది గర్వపడే క్షణమని దేశ ప్రజలకు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయా అభినందనలు తెలిపారు.

ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘మనం విజయవంతం అయ్యాం. భారత్‌కు అభినందనలు. దేశంలో 50 శాతం అర్హులు రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న గర్వపడే క్షణమిది. కొవిడ్‌పై పోరులో మనం త్వరలోనే గెలుస్తాం’ అని పేర్కొన్నారు. శనివారం ఒక్కరోజే కోటికి పైగా వ్యాక్సిన్ డోసులను అందించారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 127 కోట్లకు పైగా డోసులు పంపిణీ చేశారు. అత్యధికంగా యూపీ రాష్ట్రంలో 16 కోట్లు, లక్షద్వీప్‌లో లక్ష డోసులు పంపీణీ చేశారు. వీటిలో మొదటి డోసు 80 కోట్ల మందికి పైగా తీసుకోగా, రెండో డోసు 47 కోట్లకు పైగా తీసుకున్నట్లు అధికారక వెబ్‌సైట్‌లో పేర్కొంది. వీరిలో 18-44 ఏళ్ల మధ్య వయసు వారు 74 కోట్ల కు పైగా డోసులు తీసుకున్నారు. అదేవిధంగా 45-60 ఏళ్లు పైబడిన వారు 32 కోట్ల డోసులు, 60 ఏళ్లు పైబడిన వారు 20 కోట్లకు పైగా డోసులు తీసుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed