Corona Test: ఇంట్లోనే కరోనా పరీక్షలు చేసుకోండి.. మార్గదర్శకాలు ఇవే..!

by Anukaran |   ( Updated:2021-05-20 00:49:19.0  )
Corona Test: ఇంట్లోనే కరోనా పరీక్షలు చేసుకోండి.. మార్గదర్శకాలు ఇవే..!
X

దిశ, వెబ్‌డెస్క్ : ఇంట్లోనే కరోనా పరీక్షలు చేసుకునేందుకు ఆమోదం తెలుపుతూ.. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. ఇంట్లోనే కరోనా పరీక్షలు చేసుకునేవారి కోసం ప్రత్యేకంగా.. పూణేకు చెందిన మైల్యాబ్ డిస్కవరీ సొల్యూషన్స్ లిమిటెడ్ తయారు చేసిన ‘ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్టింగ్‌ కిట్‌ ‘కొవిసెల్ఫ్‌’కు ఐసీఎంఆర్‌ ఆమోదముద్ర వేసింది.

ముఖ్యంగా కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తులు, ఆర్‌టీపీసీఆర్ పరీక్షల్లో పాజిటివ్ వచ్చిన వారిని కాంటాక్ట్ అయిన వ్యక్తులు కూడా ర్యాపిడ్ కిట్లను ఉపయోగించాలని సూచించింది. ఒకసారి నెగెటివ్ వస్తే మరోసారి చేసుకోవాల్సి అవసరం లేదని.. లక్షణాలు ఉన్న వ్యక్తులు మాత్రం ఆర్‌టీపీసీఆర్ టెస్టులు చేసుకోవాలంది. ఇలా లక్షణాలు ఉన్నవారిని కొవిడ్ అనుమానితులుగా పరిగణించవచ్చని.. ఇటువంటి అనుమానితులు ఐసీఎంఆర్‌/ఆరోగ్య శాఖ హోం ఐసొలేషన్‌ మార్గదర్శకాలను ఫాలో కావాలని స్పష్టం చేసింది.

పూణేకు చెందిన మైల్యాబ్ డిస్కవరీ సొల్యూషన్స్ లిమిటెడ్ తయారుచేసిన ఈ కిట్ మరో వారంలో మార్కెట్‌లోకి రానుంది. ఈ కిట్ ధర రూ. 250గా నిర్ణయించినట్టు ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ హస్‌ముఖ్ స్పష్టం చేశారు. ఈ కిట్‌ ఉత్పత్తిని సిద్ధం చేయడానికి 5 నెలలు పట్టిందని.. దీనిని చాలా సులభంగా ఉపయోగించవచ్చని తెలిపారు. టెస్టులో భాగంగా 15 నిమిషాల్లోనే రిపోర్టు కూడా వస్తోందని.. అనంతరం వీటిని పారవేసేందుకు కిట్‌లోనే ఓ యూస్ అండ్ త్రో కవర్‌ కూడా అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు.

Advertisement

Next Story

Most Viewed