- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గ్రేటర్ బరిలో స్వతంత్రుల జోరు
దిశ, తెలంగాణ బ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికల నామినేషన్లలో స్వతంత్ర అభ్యర్థుల జోరు కనిపిస్తోంది. శుక్రవారం చివరి రోజు కావడంతో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. మధ్యాహ్నం మూడు గంటల వరకే గడువు కాగా, అప్పటికే రిటర్నింగ్ అధికారుల కార్యాలయాలకు చేరుకున్నవారికి రిసీప్ట్‌లు ఇచ్చి మరీ నామినేషన్లను తీసుకున్నారు. రాత్రి పది గంటల వరకూ ఈ ప్రక్రియ కొనసాగింది. మూడ్రోజుల పాటు మొత్తం 3,209 నామినేషన్ పత్రాలు దాఖలయ్యాయి. అత్యధికంగా స్వతంత్ర అభ్యర్థులు 763 మంది నామినేషన్ దాఖలు చేశారు.
అందులో టీఆర్ఎస్ నుంచి 758, బీజేపీ నుంచి 713, కాంగ్రెస్ నుంచి 443, టీడీపీ నుంచి 258, ఎంఐఎం నుంచి 105, సీపీఎం నుంచి 26, సీపీఐ నుంచి 22 నామినేషన్లు వచ్చాయి. ఒకే అభ్యర్థి రెండు డివిజన్లలో నామినేషన్లు వేసేందుకు ఎన్నికల సంఘం అవకాశమిచ్చింది. ఒక్క అభ్యర్థి కూడా రెండు డివిజన్లలో నామినేషన్లు వేయలేదని ఎన్నికల అధికారులు తెలిపారు. కూకట్ పల్లి డివిజన్‌లో అత్యధికంగా 119, అతి తక్కువగా బేగంపేటలో 39 నామినేషన్లు వచ్చాయి. నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల 22 వరకూ అవకాశం ఉంది. ఆ తర్వాత బరిలో ఎవరు ఉంటారనేదానిపై స్పష్టత రానుంది.
నామినేషన్ల వివరాలు
డివిజన్లు : 150
అభ్యర్థులు : 1,951
నామినేషన్లు : 3,220
తేదీలవారీగా
తేదీ అభ్యర్థులు నామినేషన్లు
18/11 17 20
19/11 522 608
20/11 1,452 2,592
మొత్తం 1,951 3,220