- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నేడు, రేపు జాగ్రత్త
దిశ వెబ్‌డెస్క్: ఎండాకాలం మొదలైపోయింది. మొన్నటివరకు చలితో ఉక్కిరి బిక్కిరి అయిన ప్రజలను ఇప్పుడు ఎండ భయపెడుతోంది. గత కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఎండ తీవ్రత మరింత పెరిగిపోతుండగా.. రానున్న వారం రోజుల్లో ఎండ తీవ్రత మరింత పెరిగిపోయే అవకాశముందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు.
ఎండ తీవ్రతపై తాజాగా హైదరాబాద్ వాతావరణ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇందులో నేడు, రేపు ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశముందని, సాధారణ ఉష్ణోగ్రతల కంటే మూడు డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రత పెరిగే అవకాశముందని హెచ్చరించింది. అగ్నేయ దిశ నుంచి వీస్తున్న గాలుల వల్ల నేడు, రేపు ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యే అవకాశముందని తెలిపింది.
కాగా గడిచిన 24 గంటల్లో హైదరాబాద్‌లో 37.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవ్వగా.. ఆదిలాబాద్‌లో 38 డిగ్రీలు, భద్రాచలంలో 38.5 డిగ్రీలు, ఖమ్మంలో 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.