కాంగ్రెస్‌లో తారా స్థాయికి వర్గపోరు.. పోటాపోటీగా ర్యాలీలు

by Shyam |   ( Updated:2021-09-15 06:06:12.0  )
Congress party, rallies
X

దిశ, చెన్నారావుపేట: టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి నియామకంతో ఇప్పుడిప్పుడే పుంజుకుంటోన్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్‌లు తగులుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏఐసీసీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి సొంత మండలమైన చెన్నారావుపేటలో కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. గత రెండేండ్లుగా నివురుగప్పిన నిప్పులాగా ఉన్న విభేదాలు బుధవారం నిర్వహించిన ‘దళిత దండోరా యాత్ర’లో ఒక్కసారిగా బహిర్గతం అయ్యాయి. మాజీ ఎంపీపీ అశోక్, మండల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలు పోటాపోటీగా సాగాయి. మండల నాయకుల వింత పోకడలను దారిలో పెట్టాల్సిన అధినేత దొంతి మాధవ రెడ్డి నిర్లక్ష్యంగా ఉండటం సర్వత్రా చర్చనీయాంశంగా మారిది.

ఏఐసీసీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పిలుపు మేరకు బుధవారం నియోజకవర్గ కేంద్రంలో ఇరు వర్గాలు భారీ ర్యాలీలు తీశాయి. మాజీ ఎంపీపీ జక్క అశోక్, పార్టీ మండల అధ్యక్షుడు గోపాల్ నాయక్ మరియు మొగిలి వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో ఇరువర్గాలు పోటాపోటీగా ర్యాలీలు నిర్వహించారు. గోపాల్ నాయక్ నిర్వహించిన ర్యాలీని పార్టీ కార్యాలయం వద్ద మొగిలి వెంకట్ రెడ్డి ప్రారంభించారు. జక్క అశోక్ తలపెట్టిన ర్యాలీని గ్రామ పార్టీ అధ్యక్షులు తాళ్లపెళ్లి నరసయ్య ఇంటి వద్ద జెండా ఊపి ప్రారంభించారు. వీరు నర్సంపేట నెక్కొండ ప్రధాన రహదారిపై యాత్రగా తరలివెళ్లారు. దీంతో కాంగ్రెస్ పరిస్థితిపై అధిష్టానంలో ఆందోళన మొదలైనట్లు తెలుస్తోంది. కాగా, ఈ రెండు ర్యాలీల్లో సర్పంచులు సిద్ధన రమేష్, తప్పెట రమేష్, బద్రు నాయక్, పావని రమేష్, సుజాత సారంగం, ఎంపీటీసీ సభ్యులు రమాబాయి మహబూబ్ సింగ్, గ్రామ పార్టీ అధ్యక్షులు నరసయ్య, రవి, స్వామి, భిక్షపతి, రాందాస్, హనుమ, భాస్కర్, గోవింద్, కుమార్ స్వామి, ఉప సర్పంచులు రమేష్, సతీష్, నాయకులు బొంత శ్రీను, కుమార్ స్వామి, బండి బాలరాజ్, మోహన్, రమేష్, శోభన, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed