- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దీపావళి ఎఫెక్ట్ .. ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం
దిశ, వెబ్‌డెస్క్ : దేశ రాజధాని ఢిల్లీ ప్రమాదంలో ఉంది. వాయు కాలుష్యం ఢిల్లీ వాసులను భయపెడుతుంది. దేశ రాజధానిని పట్టిపీడిస్తున్న ప్రధాన సమస్య ఏదైనా ఉందా అంటే అది వాయు కాలుష్యమే. ఇక దీపావళి పండుగ నేపథ్యంలో రాజధానిలో గురువారం వాయు కాలుష్యం పెరిగి, గాలి నాణ్యత సూచిక మరింత దిగజారిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ కాలుష్యం అనేది ఢిల్లీలోని జన్ పథ్ ప్రాతంలో ప్రమాదకర స్థాయికి చేరినట్టు అధికారులు తెలిపారు. ఆ ప్రాంతాన్ని వాయు కాలుష్యం దట్టమైన దుప్పటిలా కప్పివేసింది. వచ్చే వాహనాలు, మనుషులు సైతం కనిపించడానికి వీలు లేకుండా ప్రాంతం మారిపోయింది. ఇక వాయు కాలుష్యం కారణంగా.. దేశరాజధానిలో పలు చోట్ల ప్రజలను గొంతు నొప్పి, కళ్ల నుంచి నీరుకారడం వంటి సమస్యలు వేధిస్తున్నాయి.
పండుగ సమయంలో వాయు కాలుష్యం పెరగడంతో అధికారుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే దీపావళికి బాణాసంచా కాల్చడాన్ని, అమ్మడాన్ని ఢిల్లీ ప్రభుత్వం నిషేధించింది. ఢిల్లీలో వాయు కాలుష్యం నియంత్రించడానికి కేంద్రం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా పరిస్థితుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ప్రజలు పలు ప్రాంతాల్లో బానసంచా కాల్చుతూ పండుగను జరుపుకున్నారు. దీంతోపాటు వ్యవసాయ పొలాల్లో మంటల నుంచి వెలువడిన పొగ వల్ల ఢిల్లీలో గాలి నాణ్యత క్షీణించినట్టు అధికారులు తెలిపారు.