2021-22 లో రూ. 1.44 లక్షల కోట్లకు పైగా ఆదాయ పన్ను రీఫండ్‌లు!

by Harish |
Income Tax
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయ పన్ను శాఖ ఇప్పటివరకు రూ. 1.44 లక్షల కోట్ల పన్ను రీఫండ్‌లను జారీ చేసినట్టు బుధవారం తెలిపింది. దీనివల్ల మొత్తం 1.38 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులకు ఊరట లభించింది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ) వివరాల ప్రకారం.. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి డిసెంబర్ 20 నాటికి ఆదాయ పన్ను శాఖ ఈ రీఫండ్‌లను జమ చేసింది. ఇందులో 2021-22 అసెస్‌మెంట్ ఏడాదికి చెందిన 99.75 లక్షల పన్ను చెల్లింపుదారులకు రూ. 20,451.95 కోట్లు చెల్లించినట్లు సీబీడీటీ పేర్కొంది. 2020-21లో మొత్తం 4 కోట్లకు పైగా ఐటీఆర్‌లు దాఖలు అయ్యాయని సీబీడీటీ స్పష్టం చేసింది. అలాగే, ఇవి కాకుండా రూ. 95,133 కోట్ల విలువైన కార్పొరేట్ రీఫండ్లు, 1.35 కోట్ల సంస్థలకు రూ. 49,194 కోట్ల ఆదాయ పన్ను రీఫండ్లు జారీ చేసినట్టు వివరించింది.

Advertisement

Next Story

Most Viewed