‘‘జీవో నెం.3 పై రివ్యూ పిటిషన్ వేయాలి’’

by Shyam |

దిశ, న్యూస్‌ బ్యూరో: ఆదివాసీ, గిరిజనుల రిజర్వేషన్లు చెల్లవని జీవో నెంబర్3ను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి బాలరామ్ నాయక్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,ఏజెన్సీ ప్రాంతంలో టీచర్ల నియామకాల్లో 100 శాతం రిజర్వేషన్లు చెల్లవని జీవో నెంబర్3ను రద్దు చేస్తూ ఇచ్చిన సుప్రీం కోర్టు తీర్పును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నదన్నారు.

రాజ్యాంగంలో ఏజెన్సీలో గిరిజనులకు కల్పించిన ఇతర హక్కులైన పంచాయితీరాజ్ ఏజన్సీ ప్రాంత విస్తరణ చట్టం(పెసా) ఏజన్సీ ప్రాంత భూబదాలయింపు నిషేద చట్టం 1/70 లను సైతం రద్దుచేసే కుట్రలో భాగమే ఈ తీర్పు వచ్చిందనే అనుమానాలు కలుగుతున్నయని చెప్పారు. 50 శాతం మించి రిజర్వేషన్ ఉండకూడదనే నియమం రాజ్యంగంలోని 5, 6వ షెడ్యూల్ ప్రాంతాలకు వర్తించదనే కనీస సుత్రాలను కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం పరిగణనలోకి తీసుకోక పోవడం విచారకరమన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు గిరిజన హక్కులపై దాడి గానే ఉందని, ప్రభుత్వం స్పందించి తక్షణమే సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని డిమాండ్ చేశారు.

tags: Review petition, Go no. 3, Adivasi,Tribals Reservations, Balaram Nayak, Agency

Advertisement

Next Story

Most Viewed