దేశంలో ఎక్కువ కరోనా టెస్టులు చేస్తున్న రాష్ట్రం ఏపీనే: బొత్స

by srinivas |
దేశంలో ఎక్కువ కరోనా టెస్టులు చేస్తున్న రాష్ట్రం ఏపీనే: బొత్స
X

దేశంలో ఎక్కువ కరోనా టెస్టులు చేస్తున్న రాష్ట్రం ఏపీనేనని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ, కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యల నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని సీఎం ఆదేశించారని అన్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని వచ్చే నెల 3 వరకూ లాక్ డౌన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడం మంచిదైందని అభిప్రాయపడ్డారు.

కరోనా హాట్ స్పాట్స్‌గా గుర్తించిన ప్రాంతాల్లోని ప్రజలకు నిత్యావసర సరకులు వారి ఇళ్లకే పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఆరోగ్య సమస్యలతో బాధపడే వారికి అవసరమైన మందులు కూడా సరఫరా చేస్తున్నామని ఆయన చెప్పారు. ఏపీల రోజుకు రెండు వేల మందికి కరోనా టెస్టులు చేస్తున్నారని ఆయన వెల్లడించారు. దేశంలో అత్యధిక కరనా టెస్టులు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశేనని ఆయన వెల్లడించారు.

Tags: botsa satyanarayana, ap, ysrcp, botsa, corona, lockdown

Advertisement

Next Story

Most Viewed