- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మేడ్చల్‌లో మరో బాలుడు కిడ్నాప్, హత్య
దిశ, వెబ్‌డెస్క్: మహబూబాబాద్‌లో బాలుడు కిడ్నాప్ అయ్యి, హత్యగావింపబడ్డ విషయం మరుకముదే సరిగ్గా అలాంటి ఘటనే మరోచోట జరిగింది. వివరాళ్లోకి వెళితే… శామీర్‌పేటకు చెందిన సయ్యద్ యూసఫ్ అనే వ్యక్తి ఆటో నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఇతనికి ఒక కూతురు, ముగ్గురు కుమారులు ఉన్నారు. అయితే యూసఫ్ చిన్న కుమారుడు(అధియాన్(5)) ఈ నెల 12వ తేదీన ఇంటి ఎదుట ఆడుకుంటూ… కనిపంచకుండా పోయాడు.
దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు చుట్టుపక్కల మొత్తం వెతికారు. ఎంతకీ ఆచూకీ తెలియకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసును సీరియస్‌గా తీసుకున్నారు. ఈ క్రమంలో యూసఫ్ ఇంట్లో అద్దెకు ఉంటున్న యువకుడిపై అనుమానం వచ్చి నిలదీయగా, కిడ్నాప్ చేసి, అదే రోజు అధియాన్‌ను హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు. కాగా ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. అయితే బాలుడ్ని ఎక్కడ చంపాడనే విషయం ఇంకా తెలియరాలేదు.