కూతురు కాపురానికి అడ్డొస్తుందని.. అత్తపై కత్తితో దాడి

by Sridhar Babu |
man attacked a woman
X

దిశ, జగిత్యాల: మహిళపై కత్తితో పైశాచికంగా దాడి చేసిన ఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలోని పురాణిపేటలో చోటుచేసుకుంది. తన కూతురిని అల్లుడు కాపురానికి తీసుకెళ్లడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన తండ్రి మహేశ్, గొడవ పెట్టుకోవానికి సోమవారం కూతురి అత్తగారింటికి వచ్చాడు. అయితే, ఇంట్లో అల్లుడు లేకపోవడంతో తల్లిపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో వీపు, నడుము భాగాల్లో కత్తితో పొడవడంతో మహిళ అక్కడికక్కడే కుప్పకూలింది. గమనించిన స్థానికులు పోలీసులు సమాచారం అందించారు.

వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆమెను కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. అనంతరం నిందితుడు మహేష్‌ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ తరలించారు. అయితే, కూతురు-అల్లుడి విషయంలో పలుమార్లు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీలు జరిగాయని, తమ అల్లుడి తల్లి యమున తన కూతురుని పదే పదే అనుమానిస్తూ కాపురంలో చిచ్చు పెట్టి విడదీస్తోందని నిందితుడు మహేశ్ పోలీసుల ఎదుట తెలిపాడు. అనంతరం విషయం తెలిసిన డీఎస్పీ ప్రకాష్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed