కరోనా టీకా: రక్తం గడ్డకట్టడంపై ఎయిమ్స్ వివరణ

by Shamantha N |   ( Updated:2021-04-11 08:55:13.0  )
కరోనా టీకా: రక్తం గడ్డకట్టడంపై ఎయిమ్స్ వివరణ
X

న్యూఢిల్లీ : కరోనా వ్యాక్సిన్ వేసుకున్న వారిలో రక్తం గడ్డం కట్టడం వంటిది ‘చాలా అరుదైన’ సైడ్ ఎఫెక్ట్ అని ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఏయిమ్స్) చీఫ్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా అన్నారు. ఆస్ట్రాజెనెకాతో కలిసి భారత్ సంయుక్తంగా తయారుచేసిన కొవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారిలో (వయసు మీద పడ్డ, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారిలో) రక్తం గడ్డ కడుతుందనే వార్తల నేపథ్యంలో గులేరియా స్పందించారు. ఈ కారణాన్ని చూపుతూ పలు యూరప్ దేశాలు కొవిషీల్డ్ వాడకాన్ని కూడా నిషేదించాయి. కాగా, ఇదే విషయమై గులేరియా స్పందిస్తూ.. ‘ఇది చాలా అరుదైన సైడ్ ఎఫెక్ట్. ఒక మిలియన్ (పది లక్షలు) మందిలో ఒక్కరికి ఇలాంటి దుష్ప్రభావం కలిగే అవకాశం ఉంది. అయితే దేశంలో అలాంటికేసులైతే ఒకటి రెండు తప్ప పెద్దగా నమోదుకాలేదు’ అని తెలిపారు.

రెమిడెసివిర్ ఎగుమతులపై నిషేధం : దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ ఎక్కువవుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్ సోకిన పేషెంట్లకు చికిత్సలో అందజేసే రెమిడెసివిర్ ఎగుమతులమీద నిషేధం విధించింది. భారత్ లో కరోనా రెండో దశ కారణంగా యాక్టివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఆస్పత్రులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. కేసులు ఇంకా పెరిగే అవకాశం ఉండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రెమిడెసివిర్ ఎగుమతులను నిలిపివేయాలని సంబంధిత సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. అంతేగాక వాటి ఉత్పత్తిని పెంచాలని, ఎప్పటికప్పుడూ ఆ నిల్వలను వెబ్‌సైట్లలో అప్‌డేట్ చేయాలని సూచించింది.

Advertisement

Next Story

Most Viewed