లాస్ట్ ఛాన్స్.. అభిశంసనకు గురైన ట్రంప్!

by Anukaran |
లాస్ట్ ఛాన్స్.. అభిశంసనకు గురైన ట్రంప్!
X

దిశ, వెబ్‌డెస్క్ : అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ అభిశంసనకు గురయ్యాడు. దీంతో అమెరికా చరిత్రలో రెండోసారి అభిశంసనకు గురైన తొలి అధ్యక్షుడిగా ట్రంప్ నిలిచిపోయారు. క్యాపిటల్ హిల్ భవనంపై ట్రంప్ మద్దతుదారుల దాడితో అభిశంసన తీర్మానాన్ని అమెరికన్ ప్రతినిధుల సభ ప్రవేశ పెట్టింది. ఈ తీర్మానానికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థుల్లో 10 శాతం మంది మద్దతిచ్చినట్లు తెలుస్తోంది.

ఈ చర్యతో సొంత పార్టీ అభ్యర్థులే ట్రంప్‌ను శ్వేతసౌధం నుంచి పంపించేందుకు సంసిద్ధత కనబరించినట్లు స్పష్టంగా వ్యక్తమైంది. అనంతరం అభిశంసన తీర్మానాన్ని సభ్యులు సెనెట్‌కు పంపనున్నారు. దీనిపై సెనెట్ విచారణ జరపనుంది. ఒకవేళ దీనికి సెనెట్ ఆమోదం తెలిపితే అధికార బదిలీకి ముందే ట్రంప్ తన అధ్యక్ష పదవిని కోల్పోనున్నారు. కావున, ట్రంప్‌కు ఇదే చాన్స్‌గా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదిలాఉండగా ఈనెల 20న అమెరికా నూతన అధ్యక్షుడిగా జో బైడెన్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన ప్రమాణస్వీకారానికి ముందే ట్రంప్ తొలగింపునకు అమెరికన్ ప్రతినిధులు వ్యుహరచన చేసినట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed