ముంచుకొస్తున్న మరో తుఫాన్..

by Shamantha N |   ( Updated:2021-05-19 05:49:13.0  )
ముంచుకొస్తున్న మరో తుఫాన్..
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా మహమ్మారితో పాటు తుఫాన్లు తీవ్ర బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే తౌక్టే తుఫాన్ వలన గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు వణికిపోయాయి. సుమారు 18 మంది మరణించగా, వంద మందికి పైగా నిరాశ్రయులయ్యారు.

ముఖ్యంగా గుజరాత్ తౌక్టే తుఫాన్ అల్లకల్లోలం సృష్టించగా ఆ రాష్ట్రంలోని పరిస్థితిని ప్రధాని మోడీ ఏరియల్ సర్వే ద్వారా పర్యవేక్షించారు. ఇదిలాఉండగా దేశంలో మరో తుఫాన్ ముంచుకొస్తున్నదని భారత వాతవరణ శాఖ హెచ్చరించింది. ఈనెల 25న బంగాళాశాతంలో తుఫాన్ ప్రభావం కనిపించనుందని ఐఎండీ తెలిపింది. దీని ఎఫెక్ట్ ఈస్ట్ కోస్టుపై ఎక్కువ ప్రభావం చూపనుందని సమాచారం.యాస్ తుఫాన్‌గా దీనిని నామకరణం చేయగా, ఈనెల 26న బెంగాల్, ఒడిషా రాష్ట్రాల మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. తుఫాన్ తీరం దాటే సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed