'కరోనా నుంచి పక్కదోవ పట్టించేందుకే దాడులు చేస్తోంది'

by Aamani |
కరోనా నుంచి పక్కదోవ పట్టించేందుకే దాడులు చేస్తోంది
X

దిశ, ఆదిలాబాద్: ఇండో-చైనా సరిహద్దుల్లో చైనా దురాక్రమణను తీవ్రంగా ఖండిస్తున్నామని, చైనా దాడిలో అమరులైన వీరజవానులకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నామని ప్రముఖ సాహితీవేత్త, ఐఎంఎ జాతీయ కౌన్సిల్ సభ్యులు డా. అప్పాల చక్రాదరి అన్నారు. ఐఎంఏ జాతీయ కౌన్సిల్ ఆధ్వర్యంలో శుక్రవారం అమరులైన వీరజవాన్లకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా విషయంలో తన దుష్టపాత్రను కప్పిపుచ్చుకునేందుకు, అదేవిధంగా తమ అంతర్గత సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి, సరిహద్దు విషయంలో అంతర్జాతీయంగా వస్తున్న ఒత్తిడిని పక్కదారిపట్టించడానికి చైనా ఈ దుశ్చర్యలకు పాలుపడుతుందంటూ మండిపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed