- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడంటే ఇదే!
దిశ, పాలేరు: ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేరన్నట్లుగా ఉంది ఇక్కడి ఆఫీసర్ల తీరు..ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 50 ట్రక్కుల ఇసుక రాత్రికి రాత్రే మాయం అయిందంటే ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవలే ఇసుక అక్రమ తరలింపు వ్యవహారంలో సర్పంచ్, డిప్యూటీ తహసీల్దార్, ఎస్సై సస్పెండ్ అయిన విషయం మరవక ముందే ఈ ఘటన జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇసుక మాయం చేసిన అక్రమార్కులెవరు…? అసలు దీని వెనుక ఎవరెవరి హస్తం ఉంది …? అనే విషయమై ప్రస్తుతం చర్చ జరుగుతున్నది.
నిల్వ ఉంచిన చోటనే..
తిరుమలాయపాలెం మండలం తానంచర్ల సమీపంలోని పాలేరు వాగు నుంచి అక్రమంగా తరలించిన ఇసుకను ముజాహిద్ పురం అడ్డా చేసుకొని కొంతమంది అక్రమార్కులు అక్రమ వ్యాపారం సాగిస్తున్నారు. ఈ క్రమంలో అక్కడ నిల్వ ఉంచిన ఇసుకపై టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. 50 ట్రక్కుల ఇసుకను సీజ్ చేసి రెవెన్యూ అధికారులకు అప్పగించారు. అయితే సీజ్ చేసిన ఆ ఇసుక తెల్లవారే సరికి మాయమైంది.
అనుమానాలెన్నో..?
సీజ్ చేసిన ఇసుకను ఈ నెల 16న వేలం పాట పెట్టాలని రెవెన్యూ అధికారులు నిర్ణయించారు. అందుకు సంబంధించి నోటీసులు కూడా జారీ చేసినట్లు సమాచారం అప్పటి వరకు ఇసుక భాధ్యత స్థానిక వీఆర్వోకు అప్పగించారు. అయితే ఆయన ఆధీనంలో ఉన్న ఇసుక మాయమైందని ఆరోపణలు వస్తుండగా అది ఎలా జరిగిందో తెలియాల్సి ఉంది.
గతంలో ఇలా జరిగింది..
ఇటీవల కాలంలో ఇసుక వ్యవహారంలో తిరుమలాయపాలెం సర్పంచ్ కొండబాల వెంకటేశ్వర్లు, మండల డిప్యూటీ తహసీల్దార్ రాజేశ్, ఎస్సై నందీప్ సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. అది మరవక ముందే మరలా అలాంటి ఘటనే పునరావృతం కావడం పట్ల ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలతో ఇక్కడి అధికారులపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతోందని చెప్పొచ్చు.
ఇసుక ఎక్కడికీ పోలేదు: అరుణ, తిరుమలాయపాలెం తహసీల్దార్
ఇసుక నిల్వలను ఎవరూ తరలించలేదు. ఇసుక అక్కడే ఉంది. ఇసుక నిల్వల వద్ద వీఆర్వోను కాపలా ఉంచాం.