కరీంనగర్‌లో సీక్రెట్‌గా వ్యభిచారం.. ముగ్గురు అరెస్టు

by Sridhar Babu |
prostitution 1
X

దిశ, కరీంనగర్ సిటీ : నగరంలో గత కొద్ధి రోజులుగా గుట్టు చప్పుడు కాకుండా నడుస్తున్న వ్యభిచార గృహంపై పోలీసులు దాడులు జరిపారు. నిర్వాహకులు, విటులను మంగళవారం అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. మానకొండూర్ మండలం ముంజంపల్లి గ్రామానికి చెందిన బొమ్మరవెని సాయికుమార్, అతని భార్య కలిసి నగరంలోని మంకమ్మతోట ప్రాంతంలో నివాసముంటున్నారు. విలాసవంతమైన జీవితం గడిపేందుకు అలవాటుపడ్డ వీరు వ్యభిచార గృహాన్ని నడుపుతున్నారు.

విటులకు ముందుగానే వాట్సాప్ ద్వారా అమ్మాయిల ఫోటోలను పంపించి తమ రహస్య స్థావరాలకు పిలిపించుకొని, ద్విచక్ర వాహనాల పైన వెళ్తూ దందాను సాగిస్తున్నారు. టాస్క్‌ఫోర్స్ బృందం పక్కా సమాచారంతో మంకమ్మతోట ప్రాంతంలో వీరు నివసిస్తున్న ఇంటిపై దాడి చేయగా హుస్నాబాద్ ప్రాంతానికి చెందిన విటులు రామడుగు అశోక్, తండ్రి అంజయ్య (30) ఎదులాపురం చందు, తండ్రి సమ్మయ్య (24) సిద్దిపేటకు చెందిన పొన్నం శంకర్, తండ్రి కనకయ్య(39) పట్టుపడ్డారు. వీరిపైనా కరీంనగర్ రెండవ పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. వీరి నుంచి రూ.37,380 నగదు, 5 సెల్ ఫోన్లు, 10 కండోమ్ పాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు రెండో పట్టణ సీఐ తాతా లక్ష్మీబాబు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed