తెలంగాణ మద్యం అమ్మేది ఏపీలో

by srinivas |
తెలంగాణ మద్యం అమ్మేది ఏపీలో
X

దిశ ఏపీ బ్యూరో: గుంటూరు జిల్లాలో తెలంగాణ మద్యం పట్టుబడింది. అక్రమంగా మద్యం తరలించేవారెవర్నైనా క్షమించేది లేదని పోలీసులు ప్రకటించి 24 గంటలు కాకముందే మాచర్ల పట్టణంలోని రాయవరం జంక్షన్ వద్ద అక్రమంగా తరలిస్తున్న తెలంగాణ మద్యం పట్టుబడింది. దీని వివరాల్లోకి వెళ్తే, విశ్వసనీయ సమచారంతో మాచర్లలో రూరల్ ఎస్సై ఉదయలక్ష్మి కానిస్టేబుల్స్ సుభాని, రామరాజుతో కలిసి రాయవరం జంక్షన్ వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా కంభంపాడు వైపు నుండి రాయవరం వైపు వస్తున్న బైకుపై తెలంగాణకు చెందిన చీప్ లిక్కర్ ( కేకే ఫైన్ విస్కీ ) 52 మధ్య బాటిల్స్ పట్టుబడ్డాయి. నిందితులు రాయవరం గ్రామానికి చెందిన సూరె శ్రీనివాసరావు గౌడ్ (47), మక్కెన హనుమంతరావు (37)లను అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Next Story