- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కవ్వాల్ ఫారెస్ట్‌లో ముఖ్య నేతలు!
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: అవును… ఆ ఏరియాలో చీమ చిటుక్కుమన్నా కేసులు పెడతారు. అసలే టైగర్ జోన్.. అక్కడికి ఎవరు వెళ్లాలన్నా అనుమతి తప్పనిసరి. అయినప్పటికీ ఆ ప్రాంతంలో ఉన్న వాగులు, వంకల్లో ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. అనుమతులు ఉన్నాయా..! అంటే ఉన్నాయనే చెబుతారు. కానీ, జరిగేదంతా అక్రమ దందా. పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం అండదండలతో అధికార పార్టీ నేతలు ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు సాగిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
అక్రమ దందాలో ఆ పార్టీ వారే పార్ట్నర్లు..
ఉమ్మడి జిల్లాలో నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో విస్తరించి ఉన్న కవ్వాల్ అభయారణ్యం దట్టమైన అడవులకు పెట్టింది పేరు. దీన్ని గతంలో టైగర్ జోన్ గా ప్రభుత్వం ప్రకటించింది. ఇంతకుముందు కేవలం కలప రవాణా విషయంలో మాత్రమే ఆంక్షలు ఉండేవి. టైగర్ జోన్ గా మారిన తర్వాత ఆ ప్రాంతంలోకి ఎవరు వెళ్లినా అత్యంత కఠినమైన నిబంధనలను అమలు చేస్తు న్నారు. సాయంత్రం ఆరు గంటలు దాటితే భారీ వాహనాలను కూడా వెళ్లనివ్వకుండా అటవీశాఖ నిబంధనలను కఠినతరం చేసింది. కానీ, యథే చ్ఛగా ఇసుక అక్రమంగా తరలిపోతున్నా అటవీశాఖ ఎలాంటి చర్యలు తీసుకోలేక పోతోంది. దీనికి అధికార పార్టీ నేతల ఒత్తిళ్లే కారణమనే ఆ రోపణలున్నాయి. కవ్వాల్ అభయారణ్యంలో ఉన్న పలికేరు వాగు, పెంబి వాగు, రాజుర వా గు, జన్నారం వాగుల్లో అపారమైన ఇసుక వనరు లు ఉన్నాయి. వీటిపై అక్రమార్కుల కన్ను పడిం ది. ఈ దందాలో అధికార పార్టీ నేతలే భాగస్వాములుగా ఉండి యథేచ్ఛగా ఇసుక దందా కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా నిర్మల్, ఖానాపూర్ నియోజకవర్గాలకు చెందిన టీఆర్ఎస్ ముఖ్య నేతలు అక్రమ రవాణాకు అధికారులపై ఒత్తిళ్లు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
పగలు అనుమతులు,.. రాత్రి రవాణా..?
అక్రమ ఇసుక రవాణా విషయంలో చర్యలు తీసుకోవాల్సిన రెవెన్యూ, మైనింగ్, పోలీసు శాఖ అధికారులే అక్రమార్కుల కొమ్ము కాస్తున్నారని ఆరోపణలున్నాయి. కొన్ని పట్టా భూముల నుంచి ఇ సుక రవాణాకు అనుమతుల పేరిట ప్రధాన వా గుల్లో నుంచి పెద్ద ఎత్తున ఇసుక రవాణా చేస్తు న్నారు. ముఖ్యంగా పెంబి, రాజుర ప్రాంతాల్లో ఈ అక్రమ దందా సాగుతోంది. ఖానాపూర్, కడెం రెవెన్యూ అధికారులు అనుమతులు ఇస్తు న్నా… ఉదయం నుంచి సాయంత్రం వరకు మా త్రమే రవాణా జరుగుతోంది. కానీ, అక్రమార్కు లు మాత్రం అర్ధరాత్రి వేళ టిప్పర్లు, డంపర్ లలో రవాణా సాగిస్తున్నారు. ఈ విషయమై రెండు రోజుల క్రితం ఖానాపూర్ కాంగ్రెస్ నేతలు జిల్లా కలెక్టర్ సహా అన్ని ప్రభుత్వ శాఖలకు ఫిర్యాదు చేశారు. స్వయంగా రంగంలోకి దిగిన కాంగ్రెస్ నేతలు ఇసుక లారీలను అటవీ శాఖకు అప్పగించారు. అప్పటి దాకా ఇక్కడ ఎలాంటి అక్రమాలు జరగనట్టు అధికారులు వ్యవహరించడం గమనా ర్హం. ఈ వ్యవహారంపై అధికారులను అడిగితే ఒకరిపై ఒకరు నెట్టుకునే ప్రయత్నం చేయడం తప్ప స్వస్థత ఇచ్చేందుకు ముందుకు రాకపోవడం చూస్తే అక్రమ దందాలో అధికారుల పాత్ర కూడా ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ముఖ్య నేతల పేర్లు చెప్పి..!
నిర్మల్ నియోజకవర్గంలో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఒక ముఖ్యనేత పేరు చెప్పి కొందరు టీఆర్ఎస్ నేతలు కవ్వాల్ అభయారణ్యం నుంచి అక్రమం గా ఇసుక రవాణా చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గతంలో డబుల్ బెడ్రూంల పేరిట ఆ పార్టీ నేతలే అక్రమ ఇసుక రవాణా చేయగా… తాజాగా రైతు వేదికల పేరిట ఇసుక రవాణా చేస్తున్న ట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంపై సొంత పార్టీలోనే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఖానాపూర్ నియోజకవర్గంలో ఓ మహి ళా నేత పేరు చెప్పి అక్రమ దందా చేస్తున్నారన్న ఆరోపణలు సైతం ఉన్నాయి. కాగా, ఈ వ్యవహారంపై ఖానాపూర్, నిర్మల్ నియోజకవర్గాల నేతలు తమ అ నుచరులను పిలిచి గట్టిగా మందలించారని తెలుస్తోంది. అయినా ఇసుక రవా ణా విషయంలో నేతల తీరు మారడం లేదు. దీనిని బట్టి అక్రమ దందా చేసే అధికార పార్టీ నేతలు, అధికారులు కుమ్మక్కయ్యారని ఆరోపణలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.