- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మందుబాబులకు కేరాఫ్ అడ్రస్‌గా డబుల్ బెడ్ రూం ఇళ్లు
దిశ, మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం సమితి సింగారం పంచాయతీలోని గుట్టమల్లారం, వాగుమల్లారం ప్రాంతాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల కోసం ప్రతిష్టాత్మకంగా
నిర్మించిన డబుల్ బెడ్ ఇళ్లు మందుబాబులకు అడ్డాగా మారాయని పినపాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కో-కన్వీనర్ గురిజాల గోపి ఘాటు వ్యాఖ్యలు చేశారు. శనివారం మండలంలోని గుట్టమల్లారం, వాగుమల్లారం ప్రాంతాలను పార్టీ కార్యకర్తలతో ఆయన సందర్శించి ప్రజల సమస్యలను తెలుసుకుని డబుల్ బెడ్ రూం ఇళ్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…గుట్టమల్లారం, వాగుమల్లారంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పూర్తిగా మందుబాబులకు, పేకాటరాయుళ్లకు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయని వ్యాఖ్యానించారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తానని చెప్పి పేదలకు అన్యాయం చేశారన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్లను కాంట్రాక్టర్లు నాసిరకంగా నిర్మించారని మండిపడ్డారు. ఇలాంటి కాంట్రాక్టర్లపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా పేదవారికి డబుల్ బెడ్ రూం ఇళ్లను మంజూరు చేయాలని కోరారు. లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు, పోరాటాలు ఉధృతం చేసి ప్రజా సమస్యలపై పోరాడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకులు పొలమురి రాజు, ఎస్సీ సెల్ అధ్యక్షులు కొమరం రామ్మూర్తి, బీసీ సెల్ అధ్యక్షులు సాంబశివరావు, సీనియర్ నాయకులు కాటి బోయిన నాగేశ్వరరావు, పంచాయతీ పరిషత్ కన్వీనర్ విజయ్ కుమార్, ఎన్.ఎస్.యు.ఐ లీడర్ అరీఫ్ పాషా, జానపాటి వేణు, మాలోత్ కిషన్, ఎస్.కె షబ్బీర్, కలబోయిన మాధవరావు, కలబోయిన సతీష్, కుర్రం రవి, కుర్రం వీరన్న, తదితరులు పాల్గొన్నారు.