- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ విషయంలో సిగ్గు ఎందుకు? : ఇలియానా
దిశ, సినిమా: నడుము అందాలతో టాలీవుడ్‌ను ఏలిన గోవా బ్యూటీ ఇలియానా బాలీవుడ్‌పై మోజుతో తెలుగు సినిమాలకు దూరమైంది. ఆ మధ్య రవితేజతో కలిసి ఓ చిత్రంలో నటించినా మునుపటి గ్రేస్ చూపించడంలో విఫలమై బీటౌన్‌కే పరిమితమైంది. ఇక తాజాగా తన చేతికి గాయం కావడంతో చిన్నపిల్లలా ఏడుస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇంత వయసొచ్చాక కూడా అలా ఏడవటం ఏంటని? కామెంట్లు చేస్తున్న నెటిజన్లు.. అసలు కారణమేంటని అడిగేశారు. వారి ప్రశ్నలకు స్పందించిన ఇలియానా.. ‘కూరగాయలు తరుగుతుంటే, కత్తి పదునుగా ఉండటంవల్ల రెండు చేతివేళ్లకు లోతైన గాయమైంది. బాధ తట్టకోలేక చిన్నపిల్లలా ఏడ్చేశాను. అయినా ఏడ్చేందుకు సిగ్గుపడొద్దు. ఒంటి చేత్తో వేళ్లకు బ్యాండేజ్ వేయడం తేలికైన పనేం కాదు’ అని తాను ఏడుస్తున్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఇక పెళ్లి ఎప్పుడు? అని ప్రశ్నించిన అభిమాని ప్రశ్నకు.. ‘నాకూ చేసుకోవాలని ఉంది. కానీ వరుడు దొరకడం లేదు’ అంటూ రిప్లై ఇచ్చింది. దీంతో తనకు ఎలాంటి వరుడు కావాలో అని నెటిజన్లు చమత్కరిస్తుండటం విశేషం.