- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనా ప్రభావంతో 'ఐఫా' వాయిదా
దిశ, వెబ్‌డెస్క్: కరోనా ప్రభావం ఐఫా అవార్డుల ప్రధానోత్సవంపై పడింది. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో… మార్చి నెలాఖరున భోపాల్‌లో జరగాల్సిన కార్యక్రమం వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు నిర్వాహకులు. కరోనా వ్యాప్తి చెందుతున్న సమయంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని సంప్రదించాక… ఈవెంట్‌ను వాయిదా వేయడమే కరెక్ట్ అని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. కోవిడ్ – 19 ప్రభావం తగ్గాక మరో డేట్ అనౌన్స్ చేస్తామని వెల్లడించారు.
కాగా ప్రపంచ వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. ముఖ్యంగా కోవిడ్ – 19 ప్రభావంతో గ్లోబల్ ఫిల్మ్ ఇండస్ట్రీ కుప్పకూలింది. పలు దేశాల్లో థియేటర్లన్నీ మూతపడగా… సినిమాల విడుదల వాయిదా పడింది. భారత్‌లోనూ కరోనా పాజిటివ్ కేసుల నమోదుతో పబ్లిక్ ప్లేస్‌లో తిరగాలంటే భయపడిపోతున్నారు జనం. దీంతో షాపింగ్ మాల్స్, థియేటర్స్‌కు వచ్చేందుకు జనం ఆందోళన చెందుతుండగా… థియేటర్ యాజమాన్యాలు, సినీ నిర్మాతలు భారీగా నష్టాలను చవిచూడాల్సి వస్తోంది.
Tags: CoronaVirus, IIFA, MP, Theatres