- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంటర్‌లో పాస్ మార్కులు వస్తే అన్ని ప్రవేశాలకు అర్హులే…
by Shyam |
X
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర సర్కార్ వివిధ కోర్సుల్లో ప్రవేశానికై ఇంటర్‌లో కనీస అర్హత మార్కుల నిబంధనను తొలగించనుంది. వృత్తి విద్యాకోర్సుల్లో చేరేందుకు రాష్ట్రంలో 7 రకాల ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తున్నారు. గతంలో ఇంటర్, డిగ్రీ కోర్సుల్లో జనరల్ క్యాటగిరీ విద్యార్థులు 45 శాతం, రిజర్వ్‌డ్ క్యాటగిరీ విద్యార్థులు 40 శాతం మార్కులు సాధించాల్సిందిగా నిబంధనలు ఉండేవి.
కరోనా నేపథ్యంలో ఈ ఏడాది పరీక్షలు నిర్వహించకుండానే గతంలో సాధించిన మార్కుల ఆధారంగా, కనీస మార్కులతో పాస్ చేశారు. కనీస మార్కుల నిబంధనతో పాసైన వారంతా ప్రవేశ పరీక్షలకు అర్హతను కోల్పోవలసి వస్తుంది. ఈ అంశాలను పరిశీలించిన ప్రభుత్వం కనీస మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థులు సైతం అన్నిరకాల కోర్సుల్లో ప్రవేశాలు పొందేందుకు అవకాశాన్ని కల్పించనున్నారు.
Advertisement
Next Story