- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్నికల్లో ఓటు వేయలేదా.. అయితే మీరు ఆ ఫైన్ కట్టాల్సిందే..?
దిశ, వెబ్ డెస్క్: మీరు ఎన్నికల్లో ఓటు వేయలేదా..? ఓటు వేయలేక పోయారా..? అయితే మీరు ఫైన్ కట్టక తప్పదు. ఇదేంటని అనుకుంటున్నారా..? అవునండీ ఇప్పుడు ఢిల్లీలో ఓటు వేయక పోతే ఫైన్ కట్టాల్సిందే అనే వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఎలక్షన్ కమిషన్ ఏకంగా 350 రూపాయలు ఫైన్ విధించిందని కూడా ఆ సందేశం లో ఉంది. ఆధార్ అనుసంధానం అయిన ప్రతి ఖాతా నుంచి ఓటు వేయక పోతే ఆటోమేటిక్ గా డబ్బు కట్ అవుతుందనే పుకార్లు వ్యాపించాయి. అయితే ఈ పుకార్లు ఆ నోటా ఈ నోటా ఢిల్లీ పోలీసుల చెవిలో పడింది.
ఎన్నికల కమిషన్ సైతం ఇవన్నీ పుకార్లే ఏవి నమ్మకండి అంటూ ప్రకటన ఇవ్వాల్సి వచ్చింది. అంటే అంతలా ట్రోల్స్ అయ్యాయి అనమాట. ఈసీ చెప్పినా కూడా సోషల్ మీడియా చల్లబడలేదు. దాంతో ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదు చేసుకున్నారు. ఇంటిలిజెన్స్ ప్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ విభాగానికి ఫిర్యాదు కూడా చేశారు. దాంతో ఆ దర్యాప్తు సంస్థ వేట మొదలు పెట్టింది.