- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బీజేపీ ఎంపీలకు ప్రధాని సీరియస్ వార్నింగ్
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తమ పార్టీ ఎంపీలకు హెచ్చరికలు జారీ చేశారు. పార్లమెంటు సమావేశాలకు హాజరు కానీ ఎంపీలపై వేటు తప్పదని పరోక్షంగా హెచ్చరించినట్లు తెలిపారు. ఈ మేరకు బీజేపీ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ అంబేడ్కర్ అంతర్జాతీయ కేంద్రంలో మంగళవారం జరిగింది. పార్లమెంటు బీజేపీ ఎంపీల గైర్హాజరుపై మోడీ గట్టిగానే స్పందించారని అధికార వర్గాలు వెల్లడించాయి.
ఈ విషయాన్ని పార్టీ ఎంపీలతో సమావేశంలో పేర్కొన్నట్లు తెలిపారు. ‘ఆయన మాకు సమావేశాలకు తప్పక హాజరు కావాలని గుర్తు చేశారు. చిన్న పిల్లలతో చెప్పినట్లు ప్రతిసారి చెప్పలేను అన్నారు. ఒక వేళ మేము మారకపోతే, కార్యాచరణలో మార్పులు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు’ అని బీజేపీ ఎంపీ మీడియాకు తెలిపారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లద్ జోషి మాట్లాడుతూ గత వారం హాజరు సమస్యగా ఉందన్నారు. సభలో కోరం లేకపోవడంతో పిలిచి చెప్పాల్సి వస్తుందన్నారు.
- Tags
- bjp mps