- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డబుల్ ఇళ్లు మీరు ఇవ్వకుంటే.. మేమే పంచుతాం : మాజీ ఎమ్మెల్యే
దిశ, మిర్యాలగూడ: కోట్లాది రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అర్హులైన పేదలకు పంపిణీ చేయాలని, లేనిపక్షంలో సీపీఎం ఆధ్వర్యంలో తామే పేదలకు పంచుతామని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. శుక్రవారం ఇండస్ట్రీయల్ ఏరియా లో నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పార్టీ నాయకులతో కలిసి పరిశీలించి మాట్లాడారు. రూ.30 కోట్ల వ్యయంతో మూడేళ్ల కిందట నిర్మాణం పూర్తి చేసుకున్న 560 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఏళ్ల తరబడిగా పేదలకు పంచకపోవడం అన్యాయం అన్నారు.
రాజకీయ లబ్ధి కోసం కనీస మౌళిక వసతులు కల్పించకుండా వాటిని నిరుపయోగంగా ఉంచుతున్నారని, దీంతో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సముదాయం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందన్నారు. తక్షణమే రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, తాగునీటి వసతులు కల్పించి దరఖాస్తు చేసుకున్న పేదలకు పంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు డబ్బీకార్ మల్లేష్, జగదీష్ చంద్ర, వెంకటేశ్వర్లు, రవి నాయక్, గౌతమ్ రెడ్డి, పాండు, దేశిరామ్, ఎండి అంజాద్, అయూబ్ తదితరులు పాల్గొన్నారు.