- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దమ్ముంటే ఈసీతో మాట్లాడి ప్రకటన చేయండి
దిశ, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన అంశాలపై సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినట్లు ఉద్యోగ నేతలు ప్రకటనలు చేయడం బాధాకరమని, ఏండ్ల నుంచి ఉద్యోగుల సమస్యలు నెరవేర్చడం లేదని తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడు చిలగాని సంపత్ కుమారస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ సంఘాలను పిలిపించుకుని, ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలపై చర్చించడం సంతోషమే కానీ ఎప్పటి నుంచో రావాల్సిన పీఆర్సీ ఇవ్వకపోవడం విచారకరమన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 2018 జూన్ నుంచి పీఆర్సీ బకాయి ఉందని, గతంలో ఎన్నోసార్లు సీఎం, మంత్రులకు విజ్ఞప్తి చేశామని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
పీఆర్సీ, ఉద్యోగుల పదవీ విరమణ వయోపరిమితి, ఏపీలో పని చేస్తున్న ఉద్యోగులను తెలంగాణకు తీసుకురావడంపై చాలా ప్రకటనలు చేశారన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ ఉద్యోగులకు వరాలిచ్చాడని, కానీ అమలు చేయడంలో మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ ఇస్తున్న హామీలు మంచివేకానీ దురదృష్టంతో కలగానే మిగిలిపోతున్నాయని ఎద్దేవా చేశారు.అయితే ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎన్నికలకు ముందు మరోసారి సీఎం కేసీఆర్ను కలిసిన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పలు అంశాలపై సీఎం కేసీఆర్ సానుకూలంగా ఉన్నారని ప్రకటనలు చేస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లను నమ్మించేందుకు చూడటం బాధాకరమన్నారు. ఇలాంటి ప్రకటనలు చేయడంతో ఉద్యోగ సంఘాల నేతలకు ఏమైనా వారి స్వప్రయోజనాలు నెరవేరుతాయేమోనని, కానీ ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఎలాంటి ప్రయోజనం ఉండదని సంపత్ కుమారస్వామి మండిపడ్డారు.
సీఎం కేసీఆర్ నిజంగాను అనుకుంటే… ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకుని న్యాయబద్ధంగా రావాల్సిన పీఆర్సీ, ఏపీలో పని చేస్తున్న ఉద్యోగులను స్వరాష్ట్రానికి తీసుకురావడం, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సమానపనికి సమాన వేతనం, ఇవ్వాలని, ఇవన్నీ సాధించుకుంటేనే ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలను నమ్ముతారన్నారు. ఇప్పటికైనా ఎన్నికల కమిషన్ అనుమతితో సీఎం ఇచ్చిన హామీలపై జీవో జారీ చేయాలని, అలాంటప్పుడే ప్రభుత్వ అడుగుజాడల్లో నడుస్తామని సంపత్ కుమారస్వామి తెలిపారు. ఈ మీడియా సమావేశంలో తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి డా. పి. పురుషోత్తం, మహిళా అధ్యక్షురాలు నిర్మల తదితరులు పాల్గొన్నారు.