తప్పక గెలవాల్సిందే -మిథాలీ రాజ్

by Shyam |   ( Updated:2020-11-04 23:02:55.0  )
తప్పక గెలవాల్సిందే -మిథాలీ రాజ్
X

దిశ, వెబ్ డెస్క్: బుధవారం రాత్రి షార్జాలో జరిగిన మ్యాచ్ లో సూపర్‌నోవాస్‌, వెలాసిటీ జట్లు తలపడ్డాయి. స్వల్పలక్ష్యమే అయినా వెలాసిటీ త్వరగా వికెట్లు పోగొట్టుకోవడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. సూపర్ నోవాస్ బౌలర్లు మ్యాచ్‌నుతమవైపు తిప్పుకున్నారు. కానీ వెలాసిటీ బ్యాటర్లు సుష్మ, లుస్ కలసి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశారు. దీంతో ఉమెన్స్ టీ20 చాలెంజ్ కప్ తొలి మ్యాచ్‌లో వెలాసిటీ సూపర్ విజయం సాధించింది.

మ్యాచ్ అనంతరం వెలాసిటీ కెప్టెన్ మిథాలీ రాజ్ మాట్లాడుతూ… చాలా క్లోజ్ మ్యాచ్ ఇది. మా జట్టులో ఆడిన సభ్యులందరూ టీ20 వరల్డ్ కప్ ఆడిన వాళ్లే. కాబట్టి అలాంటి ఒత్తిడిని తట్టుకోగలిగారు. మేం అనుకున్న స్కోరుకే వారిని కట్టడి చేశాం. ఇక ఛేదనలో వేద, లుస్ చక్కని ప్రతిభ కనబర్చారు. మరి కొన్ని గంటల్లోనే తర్వాత మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఆ మ్యాచ్ గెలిస్తే నేరుగా ఫైనల్స్ కి వెళ్తాము కాబట్టి తప్పక గెలవాల్సిందే అన్నారు.

Advertisement

Next Story