ఆక్సిజన్‌ సరఫరాను అడ్డుకుంటే ఉరిశిక్ష: ఢిల్లీ హైకోర్టు

by Anukaran |   ( Updated:2021-04-24 02:07:37.0  )
ఆక్సిజన్‌ సరఫరాను అడ్డుకుంటే ఉరిశిక్ష: ఢిల్లీ హైకోర్టు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆక్సిజన్ కొరత కారణంగా ఢిల్లీలో కరోనా పేషెంట్ల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారుతున్న సంగతి తెలిసిందే. ఇదే విషయంపై ఢిల్లీలోని మహారాజ అగ్రసేన్ హాస్సిటల్ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ విపిన్‌సింగ్, జస్టిస్ రేఖలతో కూడిన ధర్మాసనం శనివారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. కేంద్ర ప్రభుత్వం ఆక్సిజన్ సరఫరా విషయంలో నిర్లక్ష్యం వహించడం ఏంటని ప్రశ్నలు వేసింది. ఆక్సిజన్ సరఫరాకు అడ్డుపడటం క్రిమినల్ చర్యగా భావించి.. ఉరివేస్తామని హెచ్చరించింది. ఇందులో ఎంత పెద్ద అధికారులు ఉన్నా ఉపేక్షించేది లేదని స్పష్టం చేసింది. ఇదే సమయంలో ఢిల్లీలో ఆక్సిజన్ ప్లాంట్ ఎందుకు ఏర్పాటు చేయలేదని నిలదీస్తూనే.. వెంటనే ప్లాంట్‌ను ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం కూడా ఆక్సిజన్ సరఫరాలో మరింత చొరవ చూపాలని నొక్కి చెప్పింది.

Advertisement

Next Story

Most Viewed