రోడ్లపై చెత్త వేస్తే జరిమానా తప్పదు.. కౌన్సిలర్ 

by Sridhar Babu |
councilor
X

దిశ, శంషాబాద్ : రోడ్లపై చెత్త వేస్తే జరిమానా తప్పదని రాల్లగూడ కౌన్సిలర్ బండి భాగ్యలక్ష్మి శ్రీకాంత్ యాదవ్ హెచ్చరించారు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2022 లో భాగంగా రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 13 వ వార్డులో గురువారం కౌన్సిలర్ చెత్తను శుభ్రం చేశారు. రాళ్లగూడలో రోడ్డు పక్కకు చెత్త వేసిన ప్రాంతాన్ని శానిటరీ సిబ్బందితో కలిసి శుభ్రం చేసి అక్కడ ముగ్గులు వేశారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ.. మున్సిపాలిటీలోని ప్రజలందరూ తడి చెత్త పొడి చెత్త వేరు చేసి 2 డబ్బాల్లో వేసి మున్సిపాలిటీ నుంచి వచ్చిన ఆటోలలో వేయాలని అన్నారు.కాలనీలలో రోడ్లపై ఎక్కడపడితే అక్కడ చెత్త వేస్తే 2,000 జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఎక్కడపడితే అక్కడ చెత్త వేయడం వల్ల ఈగలు, దోమలు చేరి అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని అన్నారు. స్వచ్ఛ మున్సిపాలిటీకి ప్రతి ఒక్కరూ సహకరించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు బండి శ్రీకాంత్ యాదవ్, విజయ్, బిక్షపతి, నాని, సానిటరీ ఇన్స్పెక్టర్ లక్ష్మయ్య, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ అనిల్ కుమార్, మున్సిపల్ సిబ్బంది దుర్గారావు, విశాల్, మహదేవ్, నగర దీపికలు నాగజ్యోతి, ప్రసన్న, సంధ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed