- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘వాటికి చెక్ పెట్టేందుకే డెడ్‌లైన్’
న్యూఢిల్లీ: ఆగస్టు 15లోపు దేశీయంగా అభివృద్ధి చేస్తున్న కోవ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెస్తామని చేసిన ప్రకటనపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) వివరణ ఇచ్చింది. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఈ వ్యాక్సిన్‌ను వీలైనంత తొందరగా అందుబాటులోకి తేవాలని, అందుకు వివిధ శాఖల నుంచి అనుమతుల్లో జాప్యం చోటుచేసుకోవద్దని, క్లినికల్ ట్రయల్స్ కూడా వేగంగా నిర్వహించాలనే ఉద్దేశంతో ఆ ప్రకటన చేశారని వివరించింది. అయితే, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగానే ఈ క్లినికల్ ట్రయల్స్ ఉంటాయని తెలిపింది. జంతువులపై మానవులపై ఏకకాలంలో ట్రయల్స్ నిర్వహించవచ్చునని పేర్కొంది.
ట్రయల్స్ సోమవారం నుంచి ప్రారంభం కావొచ్చని నిమ్స్ ప్రొఫెసర్ సి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. డెడ్‌లైన్ అందుకునేందుకు రాత్రిపగలు కష్టపడాల్సి ఉంటుందని, అయినా కాలంతో పోటిపడటమే ఉంటుందని వివరించారు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో ట్రయల్స్ కోసం వాలంటీర్ల కొరత ఉండబోదని భావిస్తున్నట్టు చెప్పారు. కాగా, ఆగస్టు 15 డెడ్‌లైన్‌పై కొందరు వైద్య నిపుణులు సందేహాలు వ్యక్తం చేశారు. కొన్నినెలల ముందే క్లినికల్ ట్రయల్స్ మొదలుపెట్టిన వ్యాక్సిన్‌లు ఇంకా మూడో దశకు చేరుకోలేవని, అలాంటిది ఇంకా ప్రి క్లినికల్ డెవలప్‌మెంట్ స్టేజ్‌లోనే ఉన్న ఈ వ్యాక్సిన్ రెండు దశలు సుమారు ఆరువారాల్లో పూర్తవుతాయని ఎలా చెప్పగలమని ప్రశ్నించారు. ఈ సందేహాలపై ఐసీఎంఆర్ తాజాగా స్పందించింది.