2100 నాటికి 15 అంగుళాలు!

by Harish |
2100 నాటికి 15 అంగుళాలు!
X

దిశ, వెబ్‌డెస్క్:

ప్రస్తుతం విడుదలవుతున్న స్థాయిలోనే కర్బన ఉద్గారాలను మానవులు వాతావరణంలోకి విడుదల చేస్తే 2100 నాటికి సముద్ర మట్టాలు 15 అంగుళాల (38 సెంటీమీటర్లు) వరకు పెరుగుతాయని శాస్త్రవేత్తలు ఓ అధ్యయనంలో కనుగొన్నారు. మానవుల వివిధ ప్రక్రియల వల్ల విడుదలవుతున్న గ్రీన్ హౌస్ వాయువుల కారణంగా భూమ్మీద ఉష్ణోగ్రత పెరుగుతోందని ఎప్పట్నుంచో శాస్త్రవేత్తలు చెబుతూనే ఉన్నారు. ఈ వేడి కారణంగా గ్రీన్‌లాండ్, అంటార్కిటికాల్లో ఉన్న మంచు ముద్దలు గణనీయ స్థాయిలో కరిగిపోతున్నాయి. ఇలా మంచు గడ్డలు కరిగిపోతే సముద్ర మట్టాలు ఎలా పెరుగుతాయనే దాని గురించి 60 మంది వాతావరణ శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు.

సముద్ర మట్టాలు పెరగడానికి మంచు గడ్డలు కరగడం కారణమైతే, ఆ మంచు గడ్డలు కరగడానికి మానవులే కారణమని బఫెలో యూనివర్సిటీ శాస్త్రవేత్త సోఫీ నౌచికీ అన్నారు. ఐస్ షీట్ మోడల్ ఇంటర్‌ కంపారిజన్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ అధ్యయనం చేశారు. దీన్ని నాసా గాడ్డార్డ్ ప్రాజెక్ట్‌లో భాగంగా చేస్తున్నారు. 2015 నుంచి 2100 మధ్య కాలంలో సముద్ర మట్టాలు ఏ విధంగా మారుతాయని వారు అధ్యయనం చేశారు. ఇందులో గ్రీన్‌లాండ్ ఐస్ షీట్ ద్వారా 3.5 అంగుళాలు, అంటార్కిటికా ఐష్ షీట్ ద్వారా 7.1 అంగుళాలు సముద్ర మట్టం పెరుగుతుందని ఈ అధ్యయనంలో తేలింది.

Advertisement

Next Story