- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ వాయిదా
న్యూఢిల్లీ: ఐసీసీ నిర్వహించనున్న ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ వాయిదా పడింది. మూడేళ్ల క్రితం ఐసీసీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, టెస్ట్ చాంపియన్‌షిప్ ఈ ఏడాది జూన్ 10 నుంచి 14 తేదీల మధ్య లండన్‌లోని లార్డ్స్ వేదికగా జరగాల్సి ఉంది. కానీ, తాజా మార్పు ప్రకారం, జూన్ 18 నుంచి 22 మధ్య నిర్వహించనున్నట్టు ఐసీసీ వెల్లడించింది. 23వ తేదీని రిజర్వ్‌డేగా ప్రకటించింది. అయితే, ఐపీఎల్-2021 షెడ్యూల్ ఇంకా ప్రకటించనప్పటికీ దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ మార్పు చేసినట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ రేసులో తొలి మూడు స్థానాల్లోని భారత్(71.7), న్యూజీలాండ్(70), ఆస్ట్రేలియా(69.2) ఉన్నాయి. ఇంగ్లాండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌లో భారత్ గెలిస్తే, ఫైనల్ బెర్తు ఖాయమైనట్టే. అలాగే, సౌతాఫ్రికాతో ఆస్ట్రేలియా 3 టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ దక్కించుకుంటే ఆసిస్‌కూ ఫైనల్ బెర్తు దక్కే అవకాశం ఉంది. అయితే, టెస్టు చాంపియన్‌షిప్ సైకిల్‌లో న్యూజీలాండ్ మరో సిరీస్ ఆడే అవకాశం లేదు. కాగా, తొలి రెండు స్థానాల్లో ఉన్న జట్లు ఫైనల్‌లో చోటు సంపాదిస్తాయి.