- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సూపర్ లీగ్ షెడ్యూల్ విడుదల
దిశ, స్పోర్ట్స్: ఇండియా వేదికగా 2023లో జరగనున్న క్రికెట్ ప్రపంచకప్‌లో పాల్గొనే జట్ల అర్హత కోసం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ‘సూపర్ లీగ్’ను ప్రవేశ పెట్టింది. ఈ నెల 30 నుంచి ఇంగ్లండ్, ఐర్లాండ్ జట్ల మధ్య మొదలయ్యే వన్డే సిరీస్‌తో సూపర్ లీగ్ ప్రారంభం కానుందని ఐసీసీ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఇంగ్లడ్‌లో 2019లో జరిగిన వన్డే వరల్డ్ కప్ కోసం అనుసరించిన క్వాలిఫయింగ్ విధానాన్నే 2023 కోసం కూడా కొనసాగిస్తున్నట్లు ఐసీసీ తెలిపింది. సూపర్ లీగ్‌లో టాప్ – 7 జట్లు నేరుగా ప్రపంచ కప్‌కు అర్హత సాధిస్తాయని, ఆతిథ్య దేశంగా ఇండియాకు సూపర్‌లీగ్‌తో సంబంధం లేకుండానే ఎంట్రీ ఉంటుందని ఐసీసీ పేర్కొంది. 12 ఐసీసీ సభ్య దేశాలతోపాటు నెదర్లాండ్స్ జట్టు సూపర్ లీగ్‌లో పోటీ పడతాయి. కాగా, పూర్తి షెడ్యూల్ మాత్రం ఐసీసీ వెల్లడించలేదు. 2022 చివరి వరకు సూపర్ లీగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. ప్రతి జట్టు స్వదేశంలో నాలుగు, విదేశాల్లో మూడు వన్డే సిరీస్‌లు ఆడాల్సి ఉంటుంది. ఆతిథ్య ఇండియాతోపాటు ఎనిమిది జట్లు సూపర్ లీగ్ ద్వారా అర్హత సాధిస్తాయి. మిగిలిన ఐదు జట్లు, ఐదు అసోసియేట్ జట్లతో 2023 క్వాలిఫయర్స్ ఆడాల్సి ఉంటుంది. దానిలో మరో రెండు జట్లను ఎంపిక చేస్తారు. మొత్తం 10 జట్లు 2023 వరల్డ్ కప్‌లో తలపడతాయి. మ్యాచ్ గెలిస్తే 10 పాయింట్లు, రద్దయినా, టై అయినా 5 పాయింట్లు లభిస్తాయి. 2023 ప్రపంచ కప్‌ను అక్టోబర్‌కు పొడిగించడంతో క్వాలిఫయింగ్ మ్యాచ్‌లకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ఐసీసీ భావిస్తున్నది.