- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీ20 ప్రపంచ కప్‌కు లైన్‌క్లియర్ !
కరోనా వైరస్ ప్రభావంతో.. ఇప్పటికే ప్రపంచ దేశాలన్నీ పాల్గొనే క్రీడా సంగ్రామం ‘ఒలింపిక్స్’ వాయిదా పడింది. ఇవేకాక క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ వంటి అనేక టోర్నీల్లో కొన్ని వాయిదా పడగా, మరికొన్ని రద్దయ్యాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాలో అక్టోబర్-నవంబర్లలో జరగనున్న టీ-20 ప్రపంచకప్ నిర్వహణపై నీలినీడలు కమ్ముకొన్నాయి. కానీ, తాజాగా ఐసీసీ.. క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పింది. టీ-20 ప్రపంచకప్ షెడ్యూల్‌లో జరగనున్న మార్పులను ప్రకటించి టోర్నీ నిర్వహణపై నెలకొన్న సందిగ్ధతను తొలగించింది.
‘ఐసీసీ టీ-20 ప్రపంచకప్ మానిటరింగ్ కమిటీ కరోనా వైరస్ సంక్షోభంపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంది. మొదట అనుకున్న ప్రకారం ఆస్ట్రేలియాలోని ఏడు స్టేడియాల్లో 2020 అక్టోబర్ 18 నుంచి నవంబర్ 20 వరకు ఐసీసీ టీ-20 ప్రపంచకప్ నిర్వహించాలని మేము ప్లాన్ చేస్తున్నాం’ అని ఐసీసీ ప్రకటించింది. ఒకవేళ అప్పటి వరకు పరిస్థితి అదుపులోకి రానట్టయితే.. టీ20 ప్రపంచ కప్‌ను రద్దు చేయాలని లేదా 2022కు వాయిదా వేయాలనే పలు వాదనలు వినిపిస్తున్నాయి.
Tags: ICC T20WC, Australia, Schedule, Corona, Cricket Fans