- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీసీసీఐకి టైం లైన్ పెట్టిన ఐసీసీ..
దిశ, స్పోర్ట్స్: పురుషుల టీ20 వరల్డ్ కప్ మరో ఐదు రోజుల్లో ప్రారంభం కానున్నది. ఒమన్ వేదికగా ముందుగా క్వాలిఫయర్ మ్యాచ్‌లు జరుగనుండగా.. ఆ తర్వాత సూపర్ 12 రౌండ్ మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. కాగా, వరల్డ్ కప్‌లో పాల్గొనే అన్ని దేశాలు తమ ఆటగాళ్లు, కోచింగ్, సహాయక సిబ్బంది వివరాలు పంపాలని ఐసీసీ కోరింది. ఇందుకు గాను గత నెల 23న చివరి రోజు గా ప్రకటించింది. దీంతో అన్ని దేశాల క్రికెట్ బోర్డులు తమ జట్ల వివరాలను ఐసీసీకి పంపించాయి. అయితే ఆటగాళ్ల వివరాల్లో మార్పుల కోసం అక్టోబర్ 10 వరకు గడువును ఇచ్చింది. దీంతో పాకిస్తాన్ వంటి క్రికెట్ బోర్డులు ఆటగాళ్లలో కొంత మందిని మార్పులు చేర్పులు చేసింది.
టీమ్ ఇండియాలో మార్పులు కూడా ఉంటాయని భావించినా కేవలం నెట్ బౌలర్‌గా ఉమ్రాన్ మాలిక్‌ను తీసుకున్నట్లు మాత్రమే చెప్పింది. కాగా, తమ జట్టులో మార్పులు చేర్పులు చేయడానికి మరో వారం రోజులు గడువు ఇవ్వాలని ఐసీసీని బీసీసీఐ కోరింది. ప్రస్తుతం ఆటగాళ్లు ఐపీఎల్‌లో బిజీగా ఉన్నారని.. అందుకే మరికొన్ని రోజులు గడువు కావాలని కోరింది. బీసీసీఐ అభ్యర్థన మేరకు తుది జట్టు మార్పుల వివరాలు పంపడానికి మరో వారం రోజులు గడువు ఇస్తున్నట్లు ఐసీసీ ప్రకటించింది. అయితే ఈ అవకాశం కేవలం సూపర్ 12కు అర్హత సాధించిన జట్లకు మాత్రమే ఉంటుందని… క్వాలిఫయర్స్‌లో ఆడే జట్లకు అవకాశం లేదని తేల్చి చెప్పింది.