వ్యవసాయ శాఖ సెక్రెటరీగా రఘునందన్​రావు

by Shyam |
IAS Raghunandan Rao
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర వ్యవసాయ శాఖ సెక్రెటరీగా సీనియర్​ ఐఏఎస్​ అధికారి ఎం. రఘునందన్​రావును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్ధన్​రెడ్డిని టీఎస్​పీఎస్సీ ఛైర్మన్​గా నియమించడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ శాఖ సెక్రెటరీగా రఘునందన్​రావుకు పూర్తి అదనపు బాధ్యతలను అప్పగిస్తున్నట్లు శుక్రవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

ప్రస్తుతం వ్యవసాయ శాఖ సెక్రెటరీతో పాటుగా కమిషనర్​గా కూడా జనార్ధన్​రెడ్డి వ్యవహరించారు. ఆయన స్థానంలో రఘునందన్​రావును నియమించడంతో ఆ బాధ్యతలన్నీ రఘునందన్​రావుకే అప్పగించినట్లైంది. ప్రస్తుతం రఘునందన్​రావు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్​గా ఉన్నారు. వాటితో పాటు వ్యవసాయ శాఖ బాధ్యతలను కూడా అప్పగించారు.

Advertisement

Next Story