ప్రేమ పెళ్లికి ఒప్పుకోని తల్లిదండ్రులు..బలవంతంగా పెళ్లి చేస్తుండగా..

by srinivas |   ( Updated:2021-08-27 07:58:39.0  )
prema,
X

దిశ, ఏపీ బ్యూరో: ఆ ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. అయితే ప్రేమ పెళ్లికి యువతి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. అంతేకాదు కొన్నాళ్లు యువతిని ఒడిశాలోని బంధువుల ఇంటి దగ్గర దాచేశారు. తాజాగా ఆమెకు పెళ్లి కూడా ఫిక్స్ చేశారు. దీంతో యువతి పోలీసులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే, విశాఖపట్నం జిల్లా మధురవాడకు చెందిన బోణీ భార్గవి(22) అనే యువతి, సాయి అనే యువకుడిని ప్రేమిస్తోంది. సాయి కూడా భార్గవిని ప్రేమించాడు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని కుటుంబ సభ్యులకు తెలిపారు.

అయితే వివాహం చేసేందుకు యువతి కుటుంబ సభ్యులు అంగీకారం తెలపలేదు. భార్గవిని ఒడిశాలోని బంధువుల ఇంటి వద్ద దాచేశారు. గుట్టుగా పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు చేశారు. పెళ్లికి ముహూర్తాలు కూడా ఫిక్స్ చేశారు. దీంతో భార్గవి డయల్ 100కు ఫోన్ చేసింది. ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారని తనకు సాయం చేయాలని కోరింది. దీంతో పోలీసులు ఆ యువతిని స్టేషన్‌కు తీసుకువెళ్లారు. అనంతరం భార్గవి, మహిళ చేతన స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి కత్తి పద్మను కలిశారు.

తనకు ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారని, తాను ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేయాలని కోరింది. భార్గవి తరపున మాట్లాడటానికి పద్మ వెళ్లగా కుటుంబ సభ్యులు దాడి చేశారని కత్తి పద్మ ఆరోపించారు. యువతికి తాము అండగా ఉంటామన్నారు. యువకుడు మంచి వ్యక్తి కాకపోతే, వారి పెళ్లికి తాము కూడా అంగీకరించమని అతను మంచి వ్యక్తి అని తేలడంతో పెళ్లి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed