‘నేను చట్టానికి లోబడిన పౌరుడిని’

by Shamantha N |
‘నేను చట్టానికి లోబడిన పౌరుడిని’
X

న్యూఢిల్లీ: పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ తాను చట్టానికి లోబడి నడుచుకుంటున్న పౌరుడినే అని డొమినికా హైకోర్టుకు తెలిపారు. మెడికల్ ట్రీట్‌మెంట్ కోసమే తాను భారత్ వదిలి అమెరికాకు వెళ్లారని వివరించారు. తాను దేశం వదిలేటప్పుడు తనపై అభయోగాలు, వారంట్లు లేవని పేర్కొన్నారు. తాను భారత్ వదిలినప్పటికీ ఏదైనా దర్యాప్తులో భాగంగా ప్రశ్నించాలనుకుంటే అందుకు సిద్ధమని అధికారులను ఆహ్వానించినట్టు కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో వివరించారు. తాను భారత చట్టాలను ఉల్లంఘించలేదని, దేశం నుంచి బయటకు వస్తున్నప్పుడూ తనపై లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు దాఖలు చేసే వారెంట్‌లేవీ లేవని పేర్కొన్నారు. డొమినికా దేశం చోక్సీని భారత్‌కు అప్పగించాలని దాఖలైన వ్యాజ్యాన్ని విచారిస్తున్న కోర్టుకు ఆయన ఈ మేరకు వివరించారు.

ఆంటిగ్వా బార్బుడాలో పౌరసత్వం పొంది తలదాచుకున్న చోక్సీ ఇటీవలే డొమినికాలోకి అక్రమంగా ప్రవేశించి పట్టుబడ్డారు. అప్పటి నుంచి జైలులో ఉన్న ఆయనపై డొమినికా ప్రభుత్వం విచారిస్తు్న్నది. మెహుల్ చోక్సీని అక్కడి నుంచి భారత్‌కే అప్పగించాలని, అతన్ని మళ్లీ తమ దేశంలోకి ఆహ్వానించాలనుకోవడం లేదని ఆంటిగ్వా దేశ ప్రధాని బ్రౌనీ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే భారత్ నుంచి ఓ విమానం డిపోర్టేషన్ డాక్యుమెంట్లతో డొమినికా చేరింది. కానీ, డొమినికా కోర్టు చోక్సీపై విచారణ మొదలుపెట్టి, వాయిదా వేయడంతో భారత బృందం తిరిగి రాక తప్పలేదు.

Advertisement

Next Story