లక్షకు పైగా బుకింగ్స్ సాధించిన క్రెటా

by Harish |
లక్షకు పైగా బుకింగ్స్ సాధించిన క్రెటా
X

దిశ, వెబ్‌డెస్క్: హ్యూండాయ్ మోటార్ ఇండియా గురువారం దేశవ్యాప్తంగా తన సరికొత్త క్రెటా కోసం 1.15 లక్షలకు పైగా బుకింగ్స్‌ను అందుకున్నట్టు వెల్లడించింది. ‘నూతన హ్యూండాయ్ క్రెటాకు వచ్చిన అనూహ్య స్పందన భారత వినియోగదారులకు తమ మీద ఉన్న విశ్వాసం, ప్రేమను తెలియజేస్తుందని హ్యూండాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ తరుణ్ గార్గ్ ఓ ప్రకటనలో తెలిపారు. కంపెనీ ఇప్పటికే కొత్త వెర్షన్ 58 వేల యూనిట్లను విక్రయించింది.

అయితే, 2015 నుంచి ఈ మోడల్ మొత్తం అమ్మకాలు 5.2 లక్షలకు పైగా ఉన్నాయని కంపెనీ పేర్కొంది. గత నెలలో మొత్తం 12,325 యూనిట్ల అమ్మకాలతో ఎస్‌యూవీ విభాగంలో క్రెటా తన లీడర్‌షిప్ స్థానాన్ని కొనసాగిస్తోందని తరుణ్ గార్గ్ తెలిపారు. ముఖ్యంగా క్రెటా జనవరి-సెప్టెంబర్ కాలంలో ఎస్‌యూవీ విభాగంలో 26 శాతం మార్కెట్ వాటాను దక్కించుకుందని కంప్నీఎ పేర్కొంది. ‘సూపర్ పర్ఫార్మింగ్ బ్రాండ్‌’ల విక్రయాల కారణంగా జనవరి-సెప్టెంబర్ కాలంలో కంపెనీ ప్యాసింజర్ వాహన మార్కెట్ వాటాను 17.6 శాతంగా నమోదు చేసిందని తరుణ్ గార్గ్ తెలిపారు.

Advertisement

Next Story