- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సరికొత్త హ్యూండాయ్ ఐ20 వచ్చేసింది
దిశ, వెబ్‌డెస్క్: మిడ్-రేంజ్ కార్లలో అత్యంత ఆదరణ కలిగిన హ్యూండాయ్ మోటార్స్ సరికొత్త ఐ20 భారత మార్కెట్లో విడుదలైంది. దీని ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధరను రూ. 6,79,900గా నిర్ణయించినట్టు కంపెనీ వెల్లడించింది. ఈ ఏడాది మార్చిలోనే ఈ సరికొత్త హ్యాచ్‌బ్యాక్‌ను తీసుకురావాలని భావించప్పటికీ కరోనా వ్యాప్తి కారణంగా వాయిదా పడింది. ఈ కొత్త i20 దేశీయంగా మారుతీ సుజుకి బలెనో, టాటా ఆల్ట్రోజ్ మోడళ్లకు గట్టి పోటీ ఇస్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
వారం క్రితం కంపెనీ బుకింగ్‌లను ప్రారంభించింది. రూ. 21 వేలకే కొత్త ఐ20ని బుకింగ్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఎల్ఈడీ హెడ్‌లైట్స్, 20.63 సెంటీమీటర్ల టచ్ స్క్రీన్, ఆకర్షణీయమైన సౌండ్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జింగ్, స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైర్ లాంటి ఫీచర్లు వాహనదారులను ఆకట్టుకుంటాయని కంపెనీ వివరించింది. ఐదేళ్ల వారెంటీ, మూడేళ్ల బ్లూలింగ్ సబ్‌స్క్రిప్షన్ అందిస్తున్నట్టు హ్యూండాయ్ మోటార్ ఇండియా తెలిపింది. సరికొత్త హ్యూండాయ్ ఐ20 పలు వేరియంట్‌లలో లభిస్తుందని కంపెనీ పేర్కొంది.