ఎగుమతి కోసం 5వేల కార్ల సిద్ధం : హుందాయ్

by Harish |   ( Updated:2020-05-30 10:49:44.0  )
ఎగుమతి కోసం 5వేల కార్ల సిద్ధం : హుందాయ్
X

ముంబయి: విదేశాలకు ఎగుమతి చేయడం కోసం ఈ నెలలో 5వేల కార్లను తయారు చేసినట్టు శనివారం హుందాయ్ మోటార్ ఇండియా ప్రకటించింది. కొవిడ్-19 వ్యాప్తి కారణంగా లాక్‌డౌన్ ప్రకటించడంతో మార్చి 25నుంచి కార్ల ఉత్పత్తి నిలిచిపోయిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్ ఆంక్షల్లో సడలింపులు ఇవ్వడంతో మే 8ను ఇండియాలోని చెన్నై ప్లాంట్‌లో హుందాయ్ మోటార్ తన కార్యకలాపాలను ప్రారంభించింది. మన దేశం నుంచి విదేశాలకు కార్లను ఎగుమతి చేయడం హుందాయ్ ఇండియా 1999లో ప్రారంభించింది. అప్పటి నుంచి కార్ల ఎగుమతిలో రారాజు ఆ సంస్థ కొనుసాగుతోంది. ఇప్పటివరకూ మన దేశం నుంచి ప్రపంచ వ్యాప్తంగా 88 దేశాలకు 30 లక్షల కార్లను హుందాయ్ ఎగుమతి చేసింది. చెన్నై ప్లాంటు నుంచి గత ఏడాది జనవరి నుంచి డిసెంబర్ వరకు 1,81,200 కార్లను విదేశాలకు హుందాయ్ మోటార్స్ ఎగుమతి చేసింది. మన దేశం నుంచి విదేశాలకు ఎగుమతి అవుతున్న కార్లలో 26శాతం ఒక్క హుందాయ్ కంపెనీకి సంబంధించినవే.

Advertisement

Next Story