యంగ్ హీరో కు షాకిచ్చిన పోలీసులు.. నిబంధనలు బ్రేక్ చేశాడని చలానా

by Anukaran |   ( Updated:2021-06-03 01:49:24.0  )
యంగ్ హీరో కు షాకిచ్చిన పోలీసులు.. నిబంధనలు బ్రేక్ చేశాడని చలానా
X

దిశ, వెబ్ డెస్క్: కొన్నిసార్లు సెలబ్రిటీలుకు కూడా పోలీస్ చలానాలు తప్పడంలేదు. కారు కి నెంబర్ ప్లేట్ సరిగ్గా లేదని, ట్రాఫిక్ నింబంధనలను ఉల్లంఘించారని అప్పుడప్పుడు ట్రాఫిక్ చలానాలు కూడా కడుతూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ కూడా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ట్రాఫిక్ చలానా కట్టాడు. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించడంతో పాటు కారు నెంబర్ ప్లేటు నిబంధనల ప్రకారం లేదని రెండు చలాన్లను విధించినట్లు పోలీసులు తెలిపారు.

కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో నెంబర్ ప్లేట్ లేకుండా నిఖిల్ కారు కనిపించింది. అయితే ఆ కారులో ఉన్నవారిని కారు ఎవరిది అని ప్రశ్నించగా హీరో నిఖిల్ ది అని తెలపడంతో పోలీసులు సెలబ్రిటీ వాహనంకు నెంబర్ ప్లేట్ సరిగా లేకపోవడంతో చలనా విధించి అక్కడి నుంచి కారు పంపించివేశారు. ఆ తర్వాత నిఖిల్ పోలీసులతో ఫోన్ లో మాట్లాడి చలానా కట్టినట్లు సమాచారం. ప్రస్తుతం హీరో కారు విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇకపోతే ప్రస్తుతం నిఖిల్ ’18 పేజీస్’, ‘కార్తికేయ 2’ చిత్రాల్లో నటిస్తున్నాడు.

Advertisement

Next Story