- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
హైదరాబాదీలే ఆ పనిలో టాప్.. తేల్చిన డేటింగ్ యాప్ సర్వే!
దిశ, ఫీచర్స్ : స్మార్ట్ ఫోన్ మనుషుల మధ్య సంబంధాలనే మార్చేస్తోంది. మొబైల్ చేతిలో ఉంటే పక్కనున్న వాడు పనికి రాకుండా పోతే.. ఎక్కడో ఉన్న వాడితో వీడియో కాల్స్, గంటల కొద్దీ ఆడియో సంభాషణలకు అధిక ప్రాధాన్యతనిస్తారు. ఇక పాండమిక్ హిట్ కూడా జతకావడంతో వర్చువల్ వరల్డ్, వర్చువల్ సంబంధాలు పెరిగిపోయాయ్. ఈ క్రమంలోనే దేశంలో వర్చువల్ డేటింగ్‌పై ఆల్‌లైన్ డేటింగ్ సంస్థ నిర్వహించిన అధ్యయనం హైదరాబాద్‌కు ఫస్ట్ ప్లేస్ కట్టబెట్టింది. ఇయర్ ఇన్ స్వైప్ -2021 సర్వే హైదరాబాదీలు రసికులని తేల్చేసింది. ఇక చెన్నై సెకండ్ ప్లేస్ కొట్టేయగా.. బెంగళూరు, అహ్మదాబాద్, పుణె నగరాలు తర్వాతి స్థానల్లో నిలిచాయి.
జనవరి 1, 2021 – నవంబర్ 30 వరకు 18-25 ఏళ్ల యువతీయువకుల కాల్ డేటాను సేకరించిన ఈ సంస్థ.. పిక్‌నిక్ ఇన్ పార్క్, సైక్లింగ్, వర్చువల్ మూవీ నైట్ లాంటి లేటెస్ట్ డేటింగ్ ట్రెండ్‌ల పట్ల ఇంట్రెస్ట్ చూపుతూనే, వర్చువల్ మీటింగ్‌కు ఓటెస్తున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో వీడియో కాల్ చాట్ 52శాతం పెరిగినట్లు వివరించింది. హైదరాబాద్, ముంబై, బెంగళూరు, చెన్నై లాంటి పట్టణాల్లో డేటింగ్ యాప్‌ల యూజింగ్, సబ్‌స్క్రిప్షన్‌లో పెరుగుదల అధిక సంఖ్యలో ఉండగా… ఈ ముసుగులోనే అనేక మోసాలు జరుగుతున్నాయని అంచనావేసింది. హానికరమైన లింక్‌లు, క్యాట్ ఫిషింగ్ ద్వారా డేటింగ్ యాప్ మోసాలు జరుగుతునండగా.. డేటింగ్ యాప్‌లకు మూడు రెట్లు ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నట్లు తెలిపింది.