- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
84 సెకన్లలో హైదరాబాదీ గర్ల్ గిన్నిస్ రికార్డ్
దిశ, ఫీచర్స్ : కరాటే చాంపియన్స్ ఎవరైనా మార్షల్ ఆర్ట్స్‌లో అప్పటి వరకు ఉన్న గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ బ్రేక్ చేసి, టైటిల్ పొందాలనే గోల్ కలిగి ఉంటారు. ఈ క్రమంలో పట్టుదలతో ప్రయత్నించి కష్టతరమైన ఫీట్స్‌ను కూడా అవలీలగా చేసేస్తుంటారు. అయినా 84 సెకన్లలో 84 సిరామిక్ టైల్స్‌ను బ్రేక్ చేయడం మాత్రం సులభం కాదు. అది కూడా 13 సంవత్సరాల అమ్మాయికి ఇంకా కష్టం. కానీ హైదరాబాద్‌కు చెందిన గాన సంతోషిణి రెడ్డి ఆ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.
జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంతో పాటు రాష్ట్రం ఏర్పడిన 84వ నెలను పురస్కరించుకుని 84 సెకన్లలో 84 సిరామిక్ టైల్స్‌ను బ్రేక్ చేసి రికార్డ్ సృష్టించింది. ఇందుకోసం ఆరు నెలలుగా ప్రాక్టీస్ చేస్తున్నట్టు వెల్లడించింది. కరాటే బ్లాక్ బెల్ట్ హోల్డర్ అయిన సంతోషిణి.. ప్రస్తుతం టైల్స్ బ్రేక్ చేసి గిన్నిస్ రికార్డ్ సాధించగా గతంలోనూ అనేక రికార్డులు నెలకొల్పింది. ఈ క్రమంలో 39 నిమిషాల్లో తలను 3,315 సార్లు సైడ్ టు సైట్ తిప్పిన రికార్డును కూడా తన పేరు మీద లిఖించుకుంది. ఇవే కాక.. ఆరు సంవత్సరాల వయసులోనే డ్యాన్స్, యెగా, కరాటే మిక్స్ చేస్తూ ఇచ్చిన ప్రదర్శనతో బాల సూర్య అవార్డును సొంతం చేసుకుంది. తండ్రి డాక్టర్ జీఎస్ గోపాల్ రెడ్డే తన గురువు కాగా, నగరంలో ఆయన కరాటే అకాడమీని నిర్వహిస్తున్నారు. ఈ క్రీడలో అంతర్జాతీయ చాంపియన్‌షిప్స్ సంపాదించి పేరు తెచ్చుకోవడమే తన కోరికని సంతోషిణి పేర్కొంది.