హైదరాబాద్‌లో పెరుగుతున్న రియల్ ఎస్టేట్ పెట్టుబడులు.. ఎందుకంటే ?

by Harish |   ( Updated:2021-09-01 11:44:57.0  )
bulding
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగంలో ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుత ఏడాది జనవరి-జూన్ మధ్యకాలంలో నగరంలో మొత్తం రూ. 2,250 కోట్ల పెట్టుబడులు వచ్చాయని ఓ నివేదిక తెలిపింది. ఇది సమీక్షించిన కాలంలో దేశం మొత్తంలో నమోదైన పెట్టుబడుల్లో 12.89 శాతం కావడం విశేషం. ఇప్పటివరకు రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించిన ముంబై, పూణె, కోల్‌కతా నగరాలను హైదరాబాద్ అధిగమించింది.

జనవరి-జూన్ మధ్య పూణె రూ. 1,690 కోట్లు, ముంబై రూ. 1,370 కోట్లు, కోల్‌కతా రూ. 760 కోట్ల పెట్టుబడులను సాధించాయి. మరో ప్రధాన నగరం చెన్నై పెట్టుబడులను పెద్దగా రాబట్టలేకపోయింది. బహుళజాతి సంస్థలు తమ అంతర్జాతీయ కేంద్రంగా హైదరాబాద్‌ను ఎంచుకుంటున్నాయని, నగరంలో మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉండటమే కాకుండా వాణిజ్య అవసరాలకు అనుకూలం కావడమే పెట్టుబడుల రాకకు కారణమని పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Next Story