- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాజకీయం చేసుకో కానీ.. రైతుల జీవితాలతో ఆడుకోకు : ఈటల
దిశ, కమలాపూర్: హుజురాబాద్ ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చెంప చెల్లుమనే సమాధానం ఇచ్చారని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. బుధవారం హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలో ఉప ఎన్నిక అనంతరం మొదటిసారి ఈటల రాజేందర్ పర్యటించారు. ఈ సందర్భంగా బత్తివానిపల్లిలోని ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ నియంత పాలనకు చరమగీతం పాడాలని హుజురాబాద్ ప్రజలకు పిలుపునిచ్చి పాదయాత్ర మొదలు పెట్టింది ఇక్కడి నుంచే అని గుర్తు చేసుకున్నారు. ఎన్నికల్లో కేసీఆర్ అహంకారాన్ని ఓడించి, ఎన్నికల్లో డబ్బు సంచులకు, మద్యం సీసాలకు తావులేదని హుజురాబాద్ ప్రజలు నిరూపించారని అన్నారు. ఎంత ఒత్తిడి చేసినా, భయభ్రాంతులకు గురిచేసినా తగ్గకుండా కేసీఆర్‌కు చెంప చెల్లుమనే తీర్పు ఇచ్చారన్నారు. రాబోయే కాలంలో హుజురాబాద్ ప్రజల స్ఫూర్తిని కరీంనగర్ జిల్లా మొత్తానికి వ్యాపింపజేయాలని అన్నారు. ఒక్క హుజురాబాద్‌లో న్యాయం జరిగితే సరిపోదని, రాష్ట్రమంతా న్యాయం, ప్రజాస్వామ్యం గెలవాలని పిలుపునిచ్చారు.
అసెంబ్లీలో ప్రగల్భాలు పలుకుతున్న కేసీఆర్ ఏడేండ్ల కాలంలో ఒక్క గింజ కూడా కొనుగోలు చేయలేదని, ధాన్యం మొత్తం కేంద్రమే కొనుగోలు చేసిందని అన్నారు. ‘‘రాజకీయాలు చేసుకో కానీ, రైతుల జీవితాలతో ఆడుకోవద్దు. రైతులతో పెట్టుకున్నోడు ఎవడూ బాగుపడలేదు.’’ అని కేసీఆర్‌ను ఈటల హెచ్చరించారు. రైతు చట్టాలను వెనక్కి తీసుకొని రైతులకు క్షమాపణ చెప్పి, బీజేపీ ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ హుందాగా నడుచుకున్నారని అన్నారు. ఇప్పటికైనా రాజకీయాలు మానేసి కేసీఆర్ రైతులకు క్షమాపణ చెప్పాలని, రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వర్షానికి ధాన్యం తడిసి రైతులు ఇబ్బంది పడుతున్నారని, రైతుల కంటనీరు తెప్పించడం మంచిదికాదని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, ధాన్యం మొత్తం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.