భార్యతో కానిస్టేబుల్.. పోలీసులకు పట్టించిన భర్త

by Anukaran |
భార్యతో కానిస్టేబుల్.. పోలీసులకు పట్టించిన భర్త
X

దిశ, వెబ్ డెస్క్: భార్య ఏఆర్ కానిస్టేబుల్ తో హోటల్ లో ఉండగా పోలీసులతో కలిసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు ఆమె భర్త. వివరాల్లోకి వెళితే… భర్తకి ఉద్యోగం పేరు చెప్పి బయటకి వెళ్ళింది జ్యోతి అనే మహిళ. ఉద్యోగం నెపంతో తనని మోసం చేస్తుంది అని అనుమానం వచ్చిన భర్త.. ఆమెను ఫాలో అయ్యాడు.

భర్త అనుమానాన్ని నిజం చేస్తూ… ఏఆర్ కానిస్టేబుల్ వంశీకృష్ణతో కలిసి రాయదుర్గంలోని ఓ హోటల్ కి వెళ్ళింది జ్యోతి. దీంతో జ్యోతి భర్త పోలీసులకు సమాచారం ఇచ్చి, వారిని సదరు హోటల్ కి తీసుకువెళ్లాడు. వారు ఉన్న రూమ్ డోర్ కొట్టగానే బాత్రూమ్ లో దాక్కుంది జ్యోతి. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న పోలీసులు… ఇద్దరినీ స్టేషన్ కి తరలించారు.

Advertisement

Next Story