దారుణంగా భార్యను హత్య చేసిన భర్త.. 24 గంటల్లోనే షాక్ ఇచ్చిన పోలీసులు

by Sumithra |
దారుణంగా భార్యను హత్య చేసిన భర్త.. 24 గంటల్లోనే షాక్ ఇచ్చిన పోలీసులు
X

దిశ, జహీరాబాద్ : జహీరాబాద్ నియోజక వర్గ కేంద్రం‌లోని శాంతినగర్ నివాసి అయిన లక్ష్మి అనే 25 సంవత్సరాల యువతిని భర్త రాములు హత్య చేశాడు. 24 గంటల్లోనే నిందితున్ని అరెస్ట్ చేసినట్లు జహీరాబాద్ డీఎస్పీ శంకర్ రాజు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏడాకులపల్లి గ్రామానికి చెందిన రాములు అనే వ్యక్తి తొమ్మిది సంవత్సరాల క్రితం లక్ష్మీ అనే యువతిని వివాహం చేసుకున్నాడు. గత నాలుగు సంవత్సరాల నుండి భార్య భర్తలు వేరువేరుగా నివసిస్తున్నారు. లక్ష్మీ పట్టణంలో గల ప్రగతి ప్రింటింగ్ ప్రెస్‌లో కూలిపని చేస్తూ జీవనం సాగిస్తుంది.

అయితే నాలుగు సంవత్సరాల నుంచి తనతో లక్ష్మీ దూరంగా ఉందని, ఇతరుల ఎవరితోనైనా అక్రమ సంబంధం కలిగి ఉండవచ్చనే అనుమానం పెంచుకున్నాడు. గురువారం రాత్రి లక్ష్మీ పనిచేసే ప్రింటింగ్ ప్రెస్ వద్దకు వెళ్లి శివాలయం వద్ద కూర్చుని మాట్లాడుకుందాం అని తీసుకు వెళ్లాడు. లక్ష్మీ, రాములు కొద్దిసేపు అక్కడ కూర్చొని మాట్లాడిన తర్వాత ఆమె తాను నివసిస్తున్న శాంతినగర్ వైపు వెళుతున్న సమయంలో ఆమెను వెంబడించాడు. హిందూ స్మశాన వాటిక ముందు రోడ్డు పక్కన గల చెట్ల పొదలలోకి ఆమెను బలవంతంగా తీసుకుపోయాడు. లక్ష్మీ ధరించిన చున్నీతో ఆమె మెడకు బిగించి శ్వాస ఆడకుండా రెండు చేతులతో గట్టిగా నొక్కి గొంతు నొక్కి చంపేశాడని డీఎస్పీ శంకర్ రాజు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed