- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాత్రి కాగానే గుడి వెనక కామక్రీడలు.. ఆ శబ్ధాలకు షాకైన గ్రామస్తులు
దిశ, వెబ్‌డెస్క్ : దేవుని గుడికి వెళ్తున్నానని చెప్పి వెళ్లిన ఓ ఇల్లాలు ఆలయం వెనక ప్రియుడితో కామక్రీడలు సాగించింది. గుడిలో భాగవతం చెబుతున్నారు వింటానని చెప్పి రోజూ వెళ్తున్న ఆమె.. అక్కడ ప్రియుడితో ఏకాంతంగా గడుపుతూ ఎంజాయ్ చేసింది. ఆలయం వెనక ఆమె రొమాన్స్‌ను కళ్లారా చూసిన భర్త.. తుపాకీతో కాల్చి హత్య చేశాడు. ఈ ఘటన బీహార్ రాజధాని పాట్నా సమీపంలోని జరిగింది.
పాట్నా రాజధానికి సమీపంలోని రాంపూర్ గ్రామంలో పదేళ్ల క్రితం సోనుకుమార్, లలితకు వివాహం అయింది. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే ఈ దంపతులు మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భర్త చేష్టలకు విసిగిన భార్య గ్రామానికి చెందిన ఓ యువకుడితో అక్రమ సంబంధాన్ని పెట్టుకుంది. భర్త లేని సమయంలో తరచూ అతడిని కలుస్తూ ఉండేది. ఈ క్రమంలో గ్రామంలోని ఓ ఆలయంలో భాగవతం చెబుతున్నారు. అయితే ప్రియుడిని కలిసేందుకు ఆమె ఆ కార్యక్రమాన్ని ఉపయోగించుకుంది.
రోజూ రాత్రి భాగవతం వింటానని గుడికి వెళ్లి.. అక్కడ ప్రియుడిని కలిసేది. అలా ఇద్దరు కలిసి ఆలయం వెనకాలే కామక్రీడల్లో మునిగి తేలేవారు. వారిద్దరి వ్యవహారాన్ని గమనించిన సోను కుమార్ మిత్రుడు.. ఫోన్ చేసి అక్కడ జరిగే తంతాగాన్ని అతడికి వివరించాడు. నేరుగా ఆలయం వెనకకు వచ్చిన భర్త.. భార్య మరో యువకుడితో రాసలీలలు సాగిస్తున్న దృశ్యాలను చూశాడు. వెంటనే ఇంటికి వెళ్లి నాటు తుపాకీ తీసుకున్నాడు. అదే సమయంలో భాగవతం అయిపోయిందని భార్య ఇంటికి రావడంతో ఆమె తలకు తుపాకీ ఎక్కుపెట్టి కాల్చాడు.
బుల్లెట్ తగిలిన ఆమె వెంటనే రక్తపు మడుగులో పడిపోయింది. తుపాకీ ఫైరింగ్ శబ్ధానికి గ్రామస్తులు షాకై.. కంగారుగా అటు వైపు వచ్చారు. వారిని చూసిన సోనుకుమార్ అక్కడి నుంచి పరారీ అయ్యాడు. లలిత ప్రాణాలతో ఉండటంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. సోనుకుమార్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా తీవ్రంగా గాయపడిన లలిత ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.